- Telugu News Photo Gallery Happy Birthday Jyothika 2022: latest photos of actress Jyothika, age, family details
HBD Jyothika 2022: జ్యోతిక-సూర్య ఫ్యామిలీ ఫొటోలు ఎప్పుడైనా చూశారా? అరుదైన సన్నివేశాలు..
దక్షిణాది నటి జ్యోతిక అందంతో పాటు, నటన, నర్తనలోనూ ఆమెకు ఆమే సాటి. తమిళ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా తనదైన శైలిలో పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు..
Updated on: Oct 18, 2022 | 10:45 AM

దక్షిణాది నటి జ్యోతిక అందంతో పాటు, నటన, నర్తనలోనూ ఆమెకు ఆమే సాటి. తమిళ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా తనదైన శైలిలో పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న జ్యోతిక 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు

1977 అక్టోబర్ 18న జన్మింన జ్యోతిక ‘డోలీ సజా కే రఖ్నా’ హిందీ చిత్రంలో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ మువీ ‘వాలి’ లో నటించింది. ఈ మువీ బిగ్ హిట్ సాధించడంతో జ్యోతిక తమిళ సినిమాలలోనే కొనసాగారు.

ఇక తెలుగులో మాస్, ఠాగూర్ వంటి పలు చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు, హిందీ, తమిళ భాషలకు సంబంధించిన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

జ్యోతిక, సూర్య వివాహం 2006 సెప్టెంబర్ 11న జరిగింది. వీరికి కూతురు దియ, కొడుకు దేవ్ - ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న 2015లో ’36 వయదినిలే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. జ్యోతిక, సూర్య కలిసి 7 చిత్రాల్లో నటించారు.

జ్యోతిక తన కెరీర్‌లో 'ఫిల్మ్‌ఫేర్', 'తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు', 'దినకరన్ అవార్డు' వంటి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.




