Telangana: తెలంగాణలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజు ఖరారు.. ఫీజుల వివరాలివే..
ఎట్టకేలకు రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్ కోర్సుల ఫీజులను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అడ్మీషన్స్ అండ్ ఫీ రెగ్యూలేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్‌సి) సిఫారసులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
ఎట్టకేలకు రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్ కోర్సుల ఫీజులను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అడ్మీషన్స్ అండ్ ఫీ రెగ్యూలేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్‌సి) సిఫారసులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. టీఏఎఫ్ఆర్సీ సిఫారసు మేరకు రాష్ట్రంలోని 159 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసింది. అదే సమయంలో ఎంటెక్ బోధించే 76 కాలేజీలకు కూడా ఫీజు ఖరారు చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ బుధవారం నాడు జీవో జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస రుసుమును రూ. 45 వేలకు పెంచింది. ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ. 57 వేలుగా ఖరారు చేసింది.
కాగా, ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోతో రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజనీరింగ్ ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ రూ.1.40లక్షలు ఖరారు చేశారు. ఈ కొత్త ఇంజినీరింగ్ ఫీజులు మూడేళ్లపాటు అమలులో ఉండనున్నాయి. ఎల్లుండి నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. అయితే, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పెంపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు సర్కార్. దాంతో పెరిగిన పీజుల భారం ఆయా రిజర్వేషన్ కలిగిన విద్యార్థులపై పడనుంది.
ఇదిలాఉంటే.. బీటెక్, ఎంటెక్ కోర్సులతో పాటు.. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల ఫీజులు కూడా పెంచింది ప్రభుత్వం. కనీస వార్షిక రుసుముగా రూ. 27 ఖరారు చేసింది. పెరిగిన ధరలు 2022-23, 2023-24, 2024-25 అకాడమిక్ ఇయర్స్‌లో అమల్లో ఉంటాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..