ESIC Recruitment 2022: ఈఎస్ఐసీ డెంటల్‌ ఆసుపత్రిలో ఉద్యోగాలు..ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కలబురగిలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (డెంటల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ట్యూటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ESIC Recruitment 2022: ఈఎస్ఐసీ డెంటల్‌ ఆసుపత్రిలో ఉద్యోగాలు..ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
ESIC Faridabad
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 19, 2022 | 7:53 AM

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కలబురగిలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (డెంటల్‌).. ఒప్పంద ప్రాతిపదికన 21 ట్యూటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు నవంబర్‌ 3, 2022వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్‌ 2, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.225లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,30,327ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.