AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Crime: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య.. పెళ్లి చేసుకుని ఆపై ఉరి పోసుకుని..

వరుసకు బావామరదళ్లు.. అనుకోకుండా ప్రేమలోపడ్డారు. ఐతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెల్పలేదు. చెబితే ఒప్పుకోరని అనుకన్నారేమో.. ఇంట్లోనుంచి వెళ్లి పోయి వివాహం చేసుకున్నారు. ఐతే ఇంతలో ఏమైందో తెలియదు ఓ హోటల్‌ గదిలో విగతజీవులుగా కనిపించారు. వివరాల్లోకెళ్తే..

Andhra Pradesh Crime: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య.. పెళ్లి చేసుకుని ఆపై ఉరి పోసుకుని..
Love Couple Commits Suicide
Srilakshmi C
|

Updated on: Oct 19, 2022 | 12:44 PM

Share

వరుసకు బావామరదళ్లు.. అనుకోకుండా ప్రేమలోపడ్డారు. ఐతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెల్పలేదు. చెబితే ఒప్పుకోరని అనుకన్నారేమో.. ఇంట్లోనుంచి వెళ్లి పోయి వివాహం చేసుకున్నారు. ఐతే ఇంతలో ఏమైందో తెలియదు ఓ హోటల్‌ గదిలో విగతజీవులుగా కనిపించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రేమజంట ఆత్మహత్య ఉదంతం మంగళవారం (అక్టోబర్‌ 18) వెలుగుచూసింది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం, చిన్నకొత్తపేట ప్రాంతానికి చెందిన కందివలస దామోదర్‌ (20) డిగ్రీ చదువుతున్నాడు. అదే జిల్లా బలగం గ్రామానికి చెందిన ఆదపాక సంతోషి కుమారి (17) ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి తాజాగా ఓ వివాహ వేడుకలో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోమవారం సాయంత్రం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గొల్లలపాలెం రామాలయం సమీపంలో అయ్యన్‌ రెసిడెన్సీలో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు గది తీసుకున్నారు. ఐతే మంగళవారం సాయంత్రం వరకు వీరిద్దరూ బయటికి రాకపోవడాన్ని హోటల్‌ సిబ్బంది గమనించింది. అంతేకాకుండా వారి గది నుంచి కొద్దిగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా ఇద్దరు బాత్‌రూమ్‌లోని కిటికీ ఊచలకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. యువతి మెడలో పసుపుతాడు ఉంది. ప్రేమికుల బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. దీంతో స్థానికంగా ఉంటున్న వారి బంధువులు విషయం తెలుసుకుని హోటల్‌ వద్దకు వచ్చారు. ఇటీవలే వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, అంతకు మించి తమకేమీ తెలియదన్నారు. ప్రేమికుల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు దామోదర్‌, సంతోషి కుమారి ప్రేమించుకున్న విషయం ఇరు కుటుంబాలకు తెలియదపి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు తెలియజేస్తే పెళ్లికి అంగీకరించేవాళ్లమని కన్నోళ్లు చెబుతున్నారు. తెలిస్తే ఏం జరుగుతుందోననే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షణికావేశంలో ఇరు కుటుంబాల్లో విషాదం మిగిల్చిన ఈ ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది.