AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. అక్కే అమ్మై సాకుతున్న వేళ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలం జగ్గంభోట్ల క్రిష్ణాపురం గ్రామంలో తల్లీ, తండ్రి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. ముందు తల్లి, ఆ తరువాత తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు.  నా అనే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆ ముగ్గురి పిల్లలలో పెద్దదైన 13 ఏళ్ళ బాలిక భావన తన తమ్ముడు యశ్వంత్ (11), చెల్లెలు కీర్తన(9)కు అన్ని తానై వారి బాధ్యతలు తన భుజాన వేసుకొని కుటుంబ భారాన్ని మోస్తూ జీవనం సాగిస్తుంది

Andhra Pradesh: తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. అక్కే అమ్మై సాకుతున్న వేళ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
Orphan Children
Fairoz Baig
| Edited By: Surya Kala|

Updated on: Feb 07, 2024 | 2:52 PM

Share

ముక్కు పచ్చరాలని వయసులో ఆ బాలిక కుటుంబ భారాన్ని మోస్తూ తన చెల్లెలు, తమ్ముడికి అమ్మానాన్న అయింది. ఊహ తెలిసేలోపే తన తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పసివాళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేదేమీ లేక ఆ బాలిక కూలీనాలి చేసుకుంటూ తన చెల్లెలు, తమ్ముడిని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ వస్తుంది. తనకు చదువుకోవాలని ఉన్నా, చేసేదేమీ లేక తన తమ్ముడి, చెల్లెలు చదువుల కోసం తన భవిష్యత్తును పణంగా పెట్టింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలం జగ్గంభోట్ల క్రిష్ణాపురం గ్రామంలో తల్లీ, తండ్రి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. ముందు తల్లి, ఆ తరువాత తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు.  నా అనే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆ ముగ్గురి పిల్లలలో పెద్దదైన 13 ఏళ్ళ బాలిక భావన తన తమ్ముడు యశ్వంత్ (11), చెల్లెలు కీర్తన(9)కు అన్ని తానై వారి బాధ్యతలు తన భుజాన వేసుకొని కుటుంబ భారాన్ని మోస్తూ జీవనం సాగిస్తుంది. భావన పొలంలో కూలి పనులు చేస్తూ కూలి పనులకు వెళ్తే వచ్చిన డబ్బులతో తన తమ్ముడు, చెల్లెలును పోషించుకుంటూ చదివిస్తుంది. తనకు చదువుకోవాలని ఉన్నా ఆర్దికంగా భారం కావడంతో తన చదువును చెల్లెలు, తమ్ముడి తన చదువు కోసం త్యాగం చేసింది. తల్లిదండ్రులు శ్రీను, ఉమా ఇటీవల ఒకరి తరువాత ఒకరు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు.

అమ్మ ఉమ సంవత్సర క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, నాలుగు నెలల క్రితం నాన్న శ్రీను కూడా అనారోగ్యంతో చనిపోయాడు.పెద్ద కుమార్తె అయిన భావన తన తల్లిదండ్రులు దూరమైనా, అన్నీ తానై తన తమ్ముడ్ని, చెల్లెల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తుంది. తన తోటి పిల్లలతో ఆటపాటలతో చదువుకుంటూ ఉల్లాసంగా ఉండవలసిన భావన ప్రతిరోజు పొలంలో కూలి పనులకు వెళ్తూ వచ్చిన నగదుతో తన తోబుట్టువుల పోషణ చూసుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తుంది. కనీసం ఉండేందుకు నిలువ నీడ లేదని, తన తండ్రి హయాంలో ఉన్న చిన్న ఇల్లు కూడా పడిపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నట్లుగా భావన తన దీనగాధ చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం నుంచి కూడా తమకు ఎటువంటి సహాయం అందలేదని తనకు చదువుకోవాలని ఉందని, కానీ తన తమ్ముడు, చెల్లి భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని చేసేదేమీ లేక కూలిపనులకు వెళ్తున్నానని చెప్పింది. ప్రభుత్వం తనతోపాటు తన తమ్ముడు చెల్లెళ్లకు అండగా ఉండాలని భావన వేడుకుంటుంది. ఆ చిన్నారులు నివసిస్తుంది మారుమూల గ్రామం కావడంతో ఆ గ్రామంలో గ్రామస్తులు తోచిన సహాయాన్ని వారికి అందిస్తున్నారు. వారికి తమ సహాయం సరిపోదని ప్రభుత్వం తల్లితండ్రులను కోల్పోయిను చిన్నారులను గుర్తించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..