Chandrababu: బీజేపీ హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీకి బాబు.. పొత్తులపై తాడో పేడో తేల్చేస్తారా..?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలుగు దేశం పార్టీ - జనసేనతో పొత్తుపై నిర్ణయం దిశగా బీజేపీ కసరత్తు మొదులపెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఎట్టకేలకు పొత్తుకు రమ్మని పిలిచింది. వస్తే సీట్ల సర్దుబాటు చేసుకకుందామని చెప్పింది. దీంతో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Chandrababu: బీజేపీ హైకమాండ్‌ పిలుపుతో ఢిల్లీకి బాబు.. పొత్తులపై తాడో పేడో తేల్చేస్తారా..?
Chandrababu Amit Shah
Follow us

|

Updated on: Feb 07, 2024 | 12:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలుగు దేశం పార్టీ – జనసేనతో పొత్తుపై నిర్ణయం దిశగా బీజేపీ కసరత్తు మొదులపెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్న చంద్రబాబుకు ఇన్నాళ్లకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఎట్టకేలకు పొత్తుకు రమ్మని పిలిచింది. వస్తే సీట్ల సర్దుబాటు చేసుకకుందామని చెప్పింది. దీంతో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటోన్న బీజేపీ అధిష్టానం… ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి పిలిచినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ హైకమాండ్‌ పిలుపుతో ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరేందుకు రెఢి అయ్యారు బాబు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు చంద్రబాబు. అమిత్‌షా తోపాటు బీజేపీ అగ్రనేతలను సైతం కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు పర్యటన తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే ఛాన్స్‌ ఉంది.

అమిత్‌షాతో చంద్రబాబు భేటీ తర్వాత ఏపీలో పొలిటికల్ పిక్చర్‌పై ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులతోపాటు సీట్ల సర్దుబాటుపై స్పష్టత రానుంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య చర్చలు జరగగా, తాజాగా బీజేపీ కలిస్తే ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనేది క్లారిటీ రానుంది. అమిత్‌షాతో భేటీలో బీజేపీకి కేటాయించే సీట్లపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు.. జనసేనతో పాటు బీజేపీకి టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తారనేదానిపైనే ఉత్కంఠ నెలకొంది.

ఏది ఏమైనా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత ఏపీలో రాజకీయంగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశమైతే కనిపిస్తోంది..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…