YS Sharmila: సీఎం జగన్, టీడీపీ అధినేతకు వైఎస్ షర్మిల లేఖ.. పేర్కొన్న ఆంశాలివే..
ఏపీలో రాజకీయాలు నోటిఫికేషన్ కంటే ముందే వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేక లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై స్పందించారు.

ఏపీలో రాజకీయాలు నోటిఫికేషన్ కంటే ముందే వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేక లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు, కడపలో ఉక్క కర్మాగారం, కొత్త రాజధాని నగర నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా అందరం కలిసి డిమాండ్ చేయాలన్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించాలని పేర్కొన్నారు. మరోసారి ప్రజల గొంతుకగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి ఆశలకు దర్పణంగా, నిబద్దతతో కలిసి పోరాడుదామని కోరారు. అధికార, ప్రతిపక్షాలన్నీ ఏకమై రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలని అన్ని పార్టీలకు విజ్ఙప్తి చేస్తున్నట్లు రాసుకొచ్చారు. నాడు తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగకుండా అభివృద్ది, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో ఈ లేఖను రాస్తున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపటానికి కృషిచేయాలన్నారు. దీనికోసం అన్నిపార్టీలు ఏకమై తమ గళాన్ని వినిపించాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




