AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తహసీల్దార్ హత్యకేసులో కీలక విషయాలు.. వెబ్‌సిరీస్‌లో విలన్ పాత్రలో నిందితుడు

నిందితుడిపై హైదరాబాద్‌, విజయవాడ పరిధిలో నమోదైన రెండు కేసులను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఇతగాడు సినిమాలపై ఇష్టంతో మూడేళ్ల క్రితం ‘ది నైట్‌’ పేరుతో రెండు ఎపిసోడ్ల వెబ్‌ సిరీస్‌ తీశాడు. ఇందుకు రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

తహసీల్దార్ హత్యకేసులో కీలక విషయాలు.. వెబ్‌సిరీస్‌లో విలన్ పాత్రలో నిందితుడు
Murari Subramanyam
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2024 | 4:03 PM

Share

ఫిబ్రవరి 7:  విశాఖ ఎమ్మార్వో మర్డర్ కేసులో నిందితుడి నేర చరిత్ర బాగానే ఉందని తెలుస్తోంది. మురారి క్రైమ్‌ హిస్టరీని వెలికి తీస్తున్న క్రమంలో పోలీసులకు కొత్త విషయాలు తెలుసుకున్నాయి. ఎమ్మార్వో హత్య కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్న మురారి సుబ్రహ్మణ్య గంగారావు.. వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో నటించాడు. రియల్‌ లైఫ్‌లో యాజిటీజ్‌గా ఎమ్మార్వో హత్య కేసులో అదే పద్దతిని అనుసరించాడు గంగారావు. ఎమ్మార్వో హత్య తర్వాత.. విమానంలో పారిపోవడం, బెంగళూరులోనే దిగి బస్సులో చెన్నైకి వెళ్లడం.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మురారి గంగారావును పోలీసులు పట్టుకుని రావడం.. నిజంగా ఓ క్రైమ్ థ్రిల్లర్‌నే తలపిస్తోంది.

మురారి గంగారావుపై హైదరాబాద్‌తో పాటుగా విజయవాడలో కేసులున్నట్లు తెలుస్తోంది. సినిమాలవైపు మక్కువతో మూడేళ్ల కిందట ‘ది నైట్‌’ పేరుతో రెండు ఎపిసోడ్ల వెబ్‌ సిరీస్‌ తీశాడు. ఇందుకు 40 లక్షలకు పైగా ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. దర్శకుడికి డబ్బులు ఇవ్వకపోవడంతో అతడు ఆ ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తానే దర్శకత్వ బాధ్యతలు తీసుకుని.. విలన్‌ పాత్ర కూడా పోషించాడు మురారి.

వెబ్ సిరీస్‌ ట్రైలర్‌లో మురారి ఓ యువతి తలపై కొట్టే సీన్ ఉంది.. అలాగే తహసీల్దారు రమణయ్యను ఇనుపరాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు సీసీటీవీ ఫుటేజిలో రికార్డైంది. హింస ఎక్కువ ఉండటంతో అతని వెబ్ సిరీస్‌కు ఓటీటీలో విడుదలకూ ఇబ్బందులు తలెత్తాయి. హైదరాబాద్‌లో రూ.1.80 కోట్ల మోసానికి పాల్పడి.. ది నైట్‌ సిరీస్‌ను వేరే నిర్మాతలకు అమ్మి డబ్బులు చెల్లిస్తానంటూ కేసులోంచి బయటపడే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. గంగారావును రిమాండ్‌కు పంపినా.. హత్యకు కారణాలు ఏంటనేవి పోలీసులు వివరించలేకపోవడం విశాఖలో.. కొత్త చర్చకు దారితీస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..