AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేటి నుంచి విశాఖలో రాజధాని త్రిసభ్య కమిటీ పర్యటన..

విశాఖ ను ప్రతిపాదిత రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా సీఎంఓ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే సీఎం ఓ విశాఖ నుంచి ఆపరేట్ అవ్వాలంటే చాలా ముందస్తు ఎక్సర్సైజ్ అవసరం. ప్రధానంగా వసతుల ఏర్పాటు, లభ్యత, ఇతర మౌలిక సదుపాయాల లాంటివి చాలా కీలకం. అందుకోసమే ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

Andhra Pradesh: నేటి నుంచి విశాఖలో రాజధాని త్రిసభ్య కమిటీ పర్యటన..
Andhra Pradesh Capital Vizag
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Oct 16, 2023 | 8:22 AM

Share

విశాఖపట్నం, అక్టోబర్ 16: విశాఖ ను ప్రతిపాదిత రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా సీఎంఓ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే సీఎంఓ విశాఖ నుంచి ఆపరేట్ అవ్వాలంటే చాలా ముందస్తు ఎక్సర్సైజ్ అవసరం. ప్రధానంగా వసతుల ఏర్పాటు, లభ్యత, ఇతర మౌలిక సదుపాయాల లాంటివి చాలా కీలకం. అందుకోసమే ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.

ఈ నేపథ్యంలో రాజధాని వసతులు, సౌకర్యాల పరిశీల నకు ప్రభుత్వం తాజాగా విడుదల మూడు జీ వో లు విడుదల చేసింది. జీ వో నంబర్ 2015 ప్రకారం నియమించిన త్రిసభ్య కమిటీ బృందం నేటి నుంచి సోమవారం నుంచి విశాఖలో క్షేత్ర స్థాయిలో పర్యటించనుంది. ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో ఏర్పాటు చేసిన ఈ బృందాన్ని మునిసిపల్ అడ్మిన్ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి లీడ్ చేయనుండగా ఆర్ధిక, సాధారణ పరిపాలనా కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే శ్రీలక్ష్మి విశాఖ చేరుకోగా మిగతా సభ్యులు ఈరోజు విశాఖ చేరుకుంటారు. ఈరోజే నగరంలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్న నేపథ్యం లో జిల్లా అధికారులు అంతా సీఎం పర్యటనలో ఉండే అవకాశం ఉంది. సీఎం పర్యటన ముగిసిన అనంతరం ఈ కమిటీ విశాఖ లో పర్యరిస్తుంది

కమిటీ ఏం చేయబోతోంది?

త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీ వో లో కమిటీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎలాంటి నివేదిక ఇవ్వనుందో స్పష్టం చేసింది ప్రభుత్వం. ఆ జీ వో ల ప్రకారం ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేయాల్సి ఉందని, ప్రత్యేకించి వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి సమీక్షల కోసం విశాఖలో ముఖ్యమంత్రి బస చేయాల్సి ఉంటుందని పేర్కొన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం, బస ఏర్పాటుతో పాటు సీఎంవోలోని అందరు అధికారులకూ ఏర్పాట్లు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా తరచూ ఆయా ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆయా జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని సీఎస్.అందులో స్పష్టం గా పొందుపరిచారు. ఇందుకోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు స్థానికంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాల కోసం తీసుకోవలసిన మౌలిక సదుపాయాల పైనా చర్యలుతీసుకోవాలని ఆ జీ వో లో ప్రభుత్వం పేర్కొంది.

కమిటీ నివేదిక మేరకే నిర్ణయాలు..

విశాఖలో నేటి నుంచి పర్యటించనున్న ఐఏఎస్ ల త్రిసభ్య కమిటీ, ముఖ్య మంత్రి కార్యాలయ మార్పు, అందుకోసం అవసరమయ్యే ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అందుబాటులో ఉన్న భవనాలను, నిర్మాణాలను పరిశీలించనుంది. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడ ఉండాలి, ఏ శాఖలు విశాఖకు రావాలి, వస్తే ఆయా శాఖల కార్యదర్శులు, విభాగ అధిపతులు ఎక్కడ ఉండాలి? ఇతర మౌలిక సదుపాయాల గురించి వీలైనంత త్వరగా నివేదిక ఇస్తుంది అని, ఆ నివేదికను బట్టి సీఎంఓ షిఫ్టింగ్, ఇతర కీలక నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

సరిగ్గా ఇదే రోజు ముఖ్యమంత్రి విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం ఫార్మాసిటీలో మరో రెండు ఫార్మా కంపెనీల ప్రారంభోత్సవాల్లో పాల్గొంతుండడం, త్రిసభ కమిటీ కూడా విశాఖలోనే పర్యటిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి విశాఖపట్నం పైనే నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్