Andhra Pradesh: చెట్టును ఢీకొన్న కారు.. దంపతులు సహా ముగ్గురు దుర్మరణం..
ఏపీ-కర్ణాటక బార్డర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లె దగ్గర కారు చెట్టును ఢీకొనగా.. ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏపీ-కర్ణాటక బార్డర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లె దగ్గర కారు చెట్టును ఢీకొనగా.. ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను, గాయపడిన వ్యక్తిని బయటకు తీశారు.
ముల్బాగల్ నుంచి పుంగనూరుకు వస్తుండగా కారు కత్తార్లపల్లె దగ్గర చెట్టును ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతిచెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నాకగ. మృతులు పుంగనూరు మంగళం కాలనీకి చెందినవారిగా గుర్తించారు. మృతులు కుమార్, భాగ్యరాజ్, డ్రైవర్ రవి అని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తీవ్రంగా గాయపడ్డ చెన్నకేశవ్ కు చికిత్స కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..