AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు పెట్టి అప్పులపాలు.. అప్పు తీర్చలేక చివరికి..

ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు. చాలామంది అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు.

IPL: ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు పెట్టి అప్పులపాలు.. అప్పు తీర్చలేక చివరికి..
Death
Aravind B
|

Updated on: Apr 26, 2023 | 8:49 AM

Share

ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు. చాలామంది అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు. కొందరైతే తమ బంగారం, బైక్ లను కూడా అమ్మేసి అప్పులు చెల్లిస్తారు. అయితే తాజాగా ఓ విద్యార్థి ఐపీఎల్ లో బెట్టింగులు పెట్టి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగ రావు, జయ దంపతులు కుమారుడు మధుకుమార్ (20).

మధుకుమార్ అనకాపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కోసం వాళ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద అప్పు చేశాడు. అయితే మధు బెట్టింగ్ లో నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. అప్పు తీర్చాలని మధుపై ఒత్తిడి వచ్చింది ఇక చేసేదేమి లేక ఈనెల 23న రాత్రి మధు ఎలుకల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం మధు మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే