IPL 2023 Points Table: అగ్రస్థానం చేరిన ధోనీ సేన.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు ఇవే..
IPL 2023 Points Table: ఐపీఎల్ సీజన్ 16 మొదటి సగం పూర్తయింది. అన్ని జట్లు 7 మ్యాచ్‌లు ఆడాయి. ఇక సెకండాఫ్‌లో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో కీలక మార్పలు చోటు చేసుకున్నాయి.
IPL 2023 Points Table: ఐపీఎల్ సీజన్ 16 మొదటి సగం పూర్తయింది. అన్ని జట్లు 7 మ్యాచ్‌లు ఆడాయి. ఇక సెకండాఫ్‌లో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో కీలక మార్పలు చోటు చేసుకున్నాయి.
దీని ప్రకారం 7 మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే 7 మ్యాచుల్లో 4 విజయాలు సాధించిన ఆర్సీబీ తొలి అర్ధభాగంలో టాప్-4లో కనిపించలేకపోయింది.
తొలి అర్ధభాగంలో మొత్తం 35 మ్యాచ్‌లు జరగగా, దాని ప్రకారం మంగళవారం ముగిసే సమయానికి ఐపీఎల్ పాయింట్ల పట్టిక వివరాలు ఇలా ఉన్నాయి..
1- చెన్నై సూపర్ కింగ్స్ (10 పాయింట్లు): మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని CSK 7 మ్యాచ్‌లలో 3 ఓటములు, 5 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. జట్టు ప్రస్తుత పాయింట్ల పట్టిక నికర రన్ రేట్ +0.662గా నిలిచింది.
2- గుజరాత్ టైటాన్స్ (10 పాయింట్లు): డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 2 ఓటములు, 5 విజయాలు నమోదు చేసింది. దీనితో +0.580 నెట్ రన్ రేట్ 4వ స్థానంలో ఉంది.
3- రాజస్థాన్ రాయల్స్ (8 పాయింట్లు): 7 మ్యాచ్‌లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. RR జట్టు ప్రస్తుత నికర రన్ రేట్ +0.844.
4- లక్నో సూపర్ జెయింట్స్ (8 పాయింట్లు): 7 మ్యాచ్‌ల్లో 3 ఓటములు, 4 విజయాలు నమోదు చేసిన కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు +0.547 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది.
5- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8 పాయింట్లు): ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని RCB 7 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 4 మ్యాచ్‌లు గెలిచింది. 3 మ్యాచ్‌లలో ఓడిపోయింది. అయితే, మైనస్ నెట్ రన్ రేట్ (-0.008) కారణంగా 5వ స్థానంలో కొనసాగుతోంది.
6 – పంజాబ్ కింగ్స్ (8 పాయింట్లు): శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన 7 మ్యాచ్‌లలో 4 గెలిచింది. 3 ఓడిపోయింది. ప్రస్తుతం నెట్ రన్ రేట్ -0.162తో 6వ స్థానంలో ఉంది.
7- ముంబై ఇండియన్స్ (6 పాయింట్లు): ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 ఓటములతో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ -0.620తో 7వ స్థానంలో ఉంది.
8- కోల్‌కతా నైట్ రైడర్స్ (4 పాయింట్లు): KKR ఆడిన 7 మ్యాచ్‌లలో 5 ఓడిపోయి 2 గెలిచింది. ప్రస్తుతం నితీష్ రాణా జట్టు నెట్ రన్ రేట్ -0.186తో 8వ స్థానంలో ఉంది.
9- సన్‌రైజర్స్ హైదరాబాద్ (4 పాయింట్లు): ఆడిన 7 మ్యాచ్‌ల్లో 2 గెలిచి, 4 మ్యాచ్‌లు ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ -0.725తో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.
10- ఢిల్లీ క్యాపిటల్స్ (4 పాయింట్లు): డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 7 మ్యాచ్‌లలో 2 గెలిచింది. దీంతో ఢిల్లీ జట్టు నెట్ రన్ రేట్ -0.961తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..