Sravana Masam 2023: శ్రావణ మాసం రావడంతో వేటి ధరలు పెరుగుతున్నాయో తెలుసా ?..
శ్రావణ మాసం.. శుభ కార్యాల మాసం... పెండ్లిండ్ల దగ్గర నుండి అన్ని రకాల శుభకార్యాలు శ్రావణ మాసంలో జరుగుతుంటాయి. తెలుగింట శుభకార్యం అంటే కొన్ని తప్పక ఉండాల్సిందే. అరటి పండ్డు, తమలపాకులు, నిమ్మకాయలు తప్పకుండా శుభకార్యంలో ఉండాల్సిందే. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావటంతో వీటి ధరలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతం అరటి, తమలపాకు, నిమ్మకాయల సాగుకు పెట్టింది పేరు.
శ్రావణ మాసం.. శుభ కార్యాల మాసం… పెండ్లిండ్ల దగ్గర నుండి అన్ని రకాల శుభకార్యాలు శ్రావణ మాసంలో జరుగుతుంటాయి. తెలుగింట శుభకార్యం అంటే కొన్ని తప్పక ఉండాల్సిందే. అరటి పండ్డు, తమలపాకులు, నిమ్మకాయలు తప్పకుండా శుభకార్యంలో ఉండాల్సిందే. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావటంతో వీటి ధరలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతం అరటి, తమలపాకు, నిమ్మకాయల సాగుకు పెట్టింది పేరు. గుంటూరు జిల్లాలోని తెనాలి మార్కెట్ నుండి నిమ్మకాయలు, కొల్లిపర మార్కెట్ నుండి అరటి పండ్లు, పొన్నూరు మార్కెట్ నుండి తమలపాకులు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే శ్రావణ మాసం కంటే ముందున్న ధరలతో పోల్చితే వీటి ధరలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి.
రెండు రోజుల నుండి కొల్లిపర మార్కెట్ లో అరటి కాయల గెలలకు అధిక ధర లభిస్తుంది. 250 కాయలున్న అరటి గెలకు వెయ్యి రూపాయల అత్యధిక ధర వచ్చింది. లంక గ్రామాల నుండి అరటి గెలలను రైతులు మార్కెట్ కు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే గత నెలలో కురిసిన వర్షాలకు పంట దెబ్బతిని డిమాండ్ కు తగిన విధంగా అరటి గెలలు మార్కెట్కు రావటం లేదని స్థానిక వ్యాపారులు అంటున్నారు. దీంతో డజను అరటి పళ్లు శ్రావణ మాసంకు ముందు నలభై నుండి అరవై రూపాయల ధర పలికితే ప్రస్తుతం ఏకంగా వంద రూపాయలు దాటి పోయింది. మరోవైపు ఇతర ప్రాంతాల నుండి వచ్చే అరటి పండ్ల దిగుమతి కూడా తగ్గిపోయింది. అయితే పంట దిగుబడి తగ్గటంతో పెరిగిన ధరలతో రైతుకు వచ్చిన లాభమేమి లేదని అన్నదాతలు వాపోతున్నారు.
ఇక తెనాలి మార్కెట్ లో నిమ్మకాలకు మంచి ధర వస్తుంది. శ్రావణ మాసం కంటే ముందు కేజీ ఆరు రూపాయల నుండి ఇరవై రూపాయల ధర పలికిన నిమ్మకాయలు ప్రస్తుతం కేజీ యాభై రూపాయలైంది. తెనాలి మార్కెట్ యార్డు నుండి అత్యధికంగా నిమ్మకాయలు బెంగాల్ కు ఎగుమతి అవుతుంటాయి. శ్రావణ మాసం రావటంతోనే ధరలు పెరిగాయని అయితే వచ్చే రెండు నెలలు నిమ్మకాయల దిగుబడి కూడా తక్కువుగా ఉంటుందని రైతులు తెలిపారు. ఇక పొన్నూరు మార్కెట్ లో బుట్ట తమలపాకులు గతంలో రెండు వేల రూపాయలుంటే ప్రస్తుతం మూడు వేల రూపాయల ధర పలుకుంది. ఒక్కో బుట్టకు ఇరవై పొత్తర్ల ఆకులుంటాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఆకు తోటల సాగు మొదలైందని పూర్తి స్థాయిలో ఆకు దిగుబడి రావాలంటే నాలుగు నెలల సమయంలో పడుతుందంటున్నారు. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం కావటంతోనే తమలపాకులకు అధిక ధర వస్తుందని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..