అరె బిడ్డా ఊరంతా మునిగిందిరా అయ్యా.. తండ్రి మాటలు విని తల్లడిల్లిన కొడుకు!
ఉపాధి కోసం వలస వెళ్ళిన కొడుక్కి ఫోన్ చేశాడో పెద్దాయన.. మాటలకంటే ముందు వరదలా కన్నీళ్ళు పొంగుకొచ్చాయి. అరె బిడ్డా ఊరంతా మునిగిందిరా అయ్యా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లోకి రాత్రి నుంచి నీళ్ళు వచ్చాయి. మంచాలపైనే ఉన్నాం.. ఇప్పుడిప్పుడే వరద తగ్గుతోంది.. నువ్వెలా ఉన్నావయ్యా.. అంటూ ఆ వృద్ద తండ్రి ఫోన్లో చేసిన సంభాషణ విన్న కొడుకు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

ఉపాధి కోసం వలస వెళ్ళిన కొడుక్కి ఫోన్ చేశాడో పెద్దాయన.. మాటలకంటే ముందు వరదలా కన్నీళ్ళు పొంగుకొచ్చాయి. అరె బిడ్డా ఊరంతా మునిగిందిరా అయ్యా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లోకి రాత్రి నుంచి నీళ్ళు వచ్చాయి. మంచాలపైనే ఉన్నాం.. ఇప్పుడిప్పుడే వరద తగ్గుతోంది.. నువ్వెలా ఉన్నావయ్యా.. అంటూ ఆ వృద్ద తండ్రి ఫోన్లో చేసిన సంభాషణ విన్న కొడుకు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. అనంతరం తేరుకుని నాయనా, జాగ్రత్తా ఉండండి అంటూ ఫోన్ పెట్టేశాడు.. ఇదీ ప్రకాశం జిల్లాలోని సింగరపల్లి పరిస్థితి..! రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే ఆగ్రామం గుండె వరద కోతకు గురైంది…
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగరపల్లి గ్రామం జల దిగ్బంధమైంది. గత 24 గంటలుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో గ్రామాన్ని వర్షం నీరు చుట్టుముట్టింది. గ్రామ చుట్టుపక్కల కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో వర్షపు నీరు వరదలా మారి గ్రామాన్ని ముంచెత్తింది. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని ఇళ్లల్లోకి వరద నీరు ఊటలాగా ఊబికి వస్తుంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ సమీపంలోని పంట కాలువలు, కాలువలు ఆక్రమణలకు గురి కావడం వల్లే వరదనీరు గ్రామాలలోకి వస్తున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




