AP Elections: వారి ఓటుబ్యాంకు ఎవరికి వరం? ఏపీ ఎన్నికల ఫలితాలపై టీవీ9 గ్రౌండ్ రియాలిటీ
ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు గురిచేస్తున్న ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. ఈ లోగా పార్టీలు ఎవరికి వారు విజయంపై లెక్కలేసుకుంటున్నారు. అయితే ఇంతకీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపిన అంశాలేంటి? నిన్నటికి నిన్న మనం ఓటింగ్ శాతాల ఆధారంగా లెక్కలేశాం.. గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ఏరియాలు, మహిళలు ఇలా విభిన్న కోణాల్లో ఎన్నికలపై అనాలసిస్ చేశాం… అంతేకాదు టఫ్ నియోజకవర్గాలు ఏంటి.. అక్కడున్న పరిస్థితులపైనా చర్చించాం…

ఇవాళ కూడా బిగ్ షో అనాలసిస్‌లో భాగంగా మరికొన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేద్దాం.. ముఖ్యంగా ఏపీలో 2019 నుంచి కులాలు ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఎవరు అవునన్నా.. కాదన్నా కులాల చుట్టూనే రాజకీయాలు తిరిగాయి. పేదలు, పెత్తందారులు నినాదాలు ఎలా ఉన్నా.. పార్టీలు అభ్యర్థుల నుంచి ఎలక్షనీరింగ్ వరకూ అంతా కులాల చుట్టూనే తిరిగాయి.. మరి కులసమీకరణాల్లో ఎవరు ముందు ఉన్నారు.. ఏ కులం ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది… అటు రీజినల్ వారీగా.. జిల్లాల వారీగా ఆయా కులాలకు పార్టీలు ప్రాధాన్యత ఎలా ఉంది అనే అంశాలపై అనాలసిస్ చేయాలని నిర్ణయించాం.. ఇందులో భాగంగా ఇవాల్టి బిగ్‌షోలో కుల సమీకరణాలే ప్రధాన అజెండా..
బిగ్ షో.. లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..