AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Elections: బాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయింది.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ, టీడీపీ కూటమి.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఫలితాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఏపీలో కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు అమిత్ షా.. అయితే, అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు.

Andhra Pradesh Elections: బాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయింది.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Sajjala Ramakrishna Reddy
Shaik Madar Saheb
|

Updated on: May 28, 2024 | 9:15 PM

Share

ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ, టీడీపీ కూటమి.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఫలితాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఏపీలో కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు అమిత్ షా.. అయితే, అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఉత్తరాదిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు దక్షిణాదిలో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చంటూ పేర్కొన్నారు.

ఇక బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఆయనకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చంద్రబాబు వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిందని సజ్జల అన్నారు. ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కౌంటింగ్‌ ప్రక్రియకు ముందే సీఎస్‌ను తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదన్నారు. మిగతా చోట్ల ధ్వంసమైన ఈవీఎంల వీడియోలు ఎక్కడ..? నిబంధనలకు విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇచ్చారంటూ పేర్కొన్నారు.

ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తమకే పడ్డాయని.. టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.. మాచర్లలో గందరగోళం సృష్టిస్తున్నారంటూ సజ్జల పేర్కొన్నారు. సీఎస్‌ను తప్పించాలన్న కుట్రతో ఆరోపణలు చేస్తున్నారు.. 10 రోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా ? వారం తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుంది.. అంటూ సజ్జల పేర్కొన్నారు.

మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఈసీ ఇచ్చిన ప్రత్యేక గైడ్‌లైన్స్‌పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్‌లైన్స్ ఎలా ఇస్తారని అన్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

మొత్తానికి ఈసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వైసీపీ.. ఎన్నికల సంఘం నిర్ణయాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. మరి… కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యేనాటికి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..