Pattikonda Politics: లోకేష్ పాదయాత్రకు ముందు.. పత్తికొండలో పొలిటికల్ హీట్.. అసలేం జరిగిందంటే..?

కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంచార్జ్ మధ్య రాజకీయం పీక్ స్టేజికి వెళ్లింది. నియోజక అభివృద్ధి దగ్గర నుంచి.. అనేక అంశాలపై ఆరోపణలు.. సవాళ్ల పర్వం మొదలైంది.

Pattikonda Politics: లోకేష్ పాదయాత్రకు ముందు.. పత్తికొండలో పొలిటికల్ హీట్.. అసలేం జరిగిందంటే..?
Pattikonda Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 13, 2023 | 7:29 AM

కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంచార్జ్ మధ్య రాజకీయం పీక్ స్టేజికి వెళ్లింది. నియోజక అభివృద్ధి దగ్గర నుంచి.. అనేక అంశాలపై ఆరోపణలు.. సవాళ్ల పర్వం మొదలైంది. దీంతో పత్తికొండలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే శ్రీదేవి.. టీడీపీ నేత శ్యాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నారా లోకేష్ పై విమర్శలు చేసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి.. పత్తికొండ టిడిపి ఇన్చార్జి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యామ్‌బాబు సవాల్ విసిరారు. నారా లోకేష్‌పై ఎమ్మెల్యే శ్రీదేవి పలు ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్‌ ఇస్తూ శ్యామ్‌బాబు రంగంలోకి దిగారు.

నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే వైస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి భయం పట్టుకుందనీ.. పాదయాత్ర జరిగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలల అవినీతి బయట పెడుతుంటే ఈమె భాగోతం కూడా బయటపడుతుందని ముందే భయపడుతోందని ఆరోపించారు శ్యామ్‌బాబు. 53 చెరువులకు నీళ్లు, పత్తికొండకు తాగు నీరు, ప్రతి గ్రామానికి రోడ్లు, వేసిన చరిత్ర తమదే అన్నారు. పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, రోడ్లు వెడల్పు సహా పలు అంశాలను ప్రస్తావించారు. నాలుగు సంవత్సరాల్లో పత్తికొండ అభివృద్ధి శున్యమనీ.. కేవలం టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. పత్తికొండ నాలుగు స్తంభాల దగ్గర బహిరంగ చర్చకు సిద్ధమా.. అంటూ పత్తికొండ టీడీపీ ఇంఛార్జి కె.ఈ. శ్యాంబాబు సవాల్ విసిరారు.

వీళ్లిద్దరి మధ్య సవాళ్లు, ఆరోపణలతో ఏడాది ముందే పత్తికొండలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్