Chandrababu: గుడివాడపై టీడీపీ ఫుల్ ఫోకస్.. పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న చంద్రబాబు రోడ్ షో..
బందరులో బంపర్ షో జరిగింది. ఇక గుడివాడ సెంటరే మిగిలింది. చంద్రబాబు పర్యటన ఈరోజు ఎలా ఉండబోతోంది? నిమ్మకూరు నుంచి గుడివాడ వరకు హైటెన్షన్ క్రియేట్ అవుతుందా? వైసీపీ ఎలా డిఫెండ్ చేసుకుంటుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న పేర్నినాని అడ్డాలో రోడ్‌షో నిర్వహించిన బాబు.. ఈరోజు కొడాలి నాని ఇలాఖాలోకి వస్తున్నారు. గుడివాడలో రోడ్ షో.. సభ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. బందరులో ఇదేం ఖర్మ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బటన్ నొక్కి జగన్ 2 లక్షల కోట్లు బొక్కేశారన్నారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. అటు పేర్నినాని, వల్లభనేని వంశీపైనా సెటైర్లు వేశారు. జగన్ దేశంలోనే నెంబర్ వన్ ధనిక సీఎం అని డేటా వచ్చిందని.. ఈయన పేదల ప్రతినిధి ఎలా అవుతారని అన్నారు బాబు. రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆయన ధనికుడు అవుతున్నారన్నారు. జగన్ కొత్తగా స్టిక్కర్లు వేస్తున్నారని.. ఆయన నమ్మకం కాదు శాపం అంటూ మండిపడ్డారు. వైనాట్ కుప్పం కాదు.. పులివెందులలో గెలిచి చూపించామన్నారు చంద్రబాబు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు సత్తా చూపించారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామన్నారు బాబు.
కాగా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసే క్రమంలో చంద్రబాబు పర్యటన కీలకం కానుంది. అదే సమయంలో జిల్లాలోని గన్నవరం.. గుడివాడపైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉంది. దీంతో.. గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర పర్యటనపైన ఆసక్తి నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి బస్ స్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో సాగుతుంది. గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. గుడివాడలోని వీకేఆర్, కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. గుడివాడలో కొంత కాలంగా కొడాలి నాని వర్సస్ టీడీపీ రాజకీయం ఇప్పుడు చంద్రబాబు పర్యటనతో కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
నిన్న చంద్రబాబుకు స్వాగతం చెప్పే ర్యాలీలో ఎన్టీఆర్ అభిమానులు హడావుడి చేశారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న ఫోటోలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. పెనమాలూరు, గూడూరులలో ఎన్టీఆర్ అభిమానులు హల్‌చల్ చేయడం పార్టీ వర్గాలకు ఇబ్బంది కరంగా మారింది. జై బాబు అంటూనే జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు అభిమానులు.
అంతకు ముందు గూడూరు జంక్షన్‌లో హైటెన్షన్ నెలకొంది. మంత్రి జోగి రమేశ్ కోసం వైసీపీ శ్రేణులు.. ఇటు చంద్రబాబు కోసం టీడీపీ శ్రేణులు.. భారీ గజమాలలతో రోడ్డెక్కడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే, ముందుగా జోగి రమేశ్ రావడంతో… ఆయనకు భారీ గజమాలతో సత్కరించారు వైసీపీ నాయకులు. టీడీపీ శ్రేణుల్ని భారీకేడ్లు అడ్డుపెట్టి నిలువరించారు పోలీసులు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోగి… ఏ ముఖం పెట్టుకుని తమ జిల్లాకు వచ్చారని నిలదీశారు.
ఈరోజు గుడివాడ హీట్ ఎలా ఉండబోతోంది? కొడాలి నాని ఇలాఖాలో బాబు ఎలా స్పందించబోతున్నారు. ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు.. నిమ్మకూరు టు గుడివాడ ఎలా సాగబోతోంది? వెయిట్ అండ్ సీ.
మరిన్ని ఏపీ వార్తల కోసం..