Kurnool: పెట్రోల్ బంక్‌లో చివరిగా కనిపించిన బైకర్.. అతడితో ఉన్న వ్యక్తి ఎవరంటే.?
ప్రమాదానికి కారణాలేంటి? ఇందులో బైకర్ ప్రమేయం ఎంత? క్షణాల వ్యవధిలో మంటలు ఆ స్థాయిలో ఎగిసిపడటానికి కారణాలేంటి? కర్నూలు బస్సు ప్రమాదంలో డ్రైవర్ల నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.

కర్నూలు ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఓ అంచనా రాలేకపోతున్నారు పోలీసులు. బైకర్ శివశంకర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతను దొరికితే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాద ఘటన కేసు దర్యాప్తును స్పీడ్ చేశారు. ఇప్పటికే ఆ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, కోడ్రైవర్ నారాయణను అదుపులోకి తీసుకున్నారు. పల్నాడుకు చెందిన లక్ష్మయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడు 5వ తరగతి వరకు చదువుకుని, 10వతరగతి నకిలీ సర్టిఫికెట్‌తో హెవీ లైసెన్స్ పొందినట్టు గుర్తించారు. బస్సుడ్రైవర్‌గా పని చేయడానికి ముందు లారీ డ్రైవర్ పనిచేసినట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్‌గా ఉండగానే 2004లో ఒక యాక్సిడెంట్ చేశాడు మిరియాల లక్ష్మయ్య. ఇద్దరు డ్రైవర్ల నుంచి వివరాల సేకరణ చేస్తున్నారు.
అటు ప్రమాదానికి ముందు బైక్‌పై శివశంకర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ఎర్రి స్వామిగా పోలీసులు గుర్తించారు. తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి చెందిన సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. నిన్న తెల్లవారుజామున రెండు గంటల 22 నిమిషాలకు శివశంకర్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినట్లు దృశ్యాలు చూపిస్తున్నాయి. నాలుగు నిమిషాల పాటు అక్కడ ఉన్న శివశంకర్ 2 గంటల 26 నిమిషాలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సరిగ్గా 13 నిమిషాల తర్వాత రెండు గంటల 39 నిమిషాల 50 సెకండ్లకు ఆ పెట్రోల్ బంక్ దాటింది వి.కావేరీ ట్రావెల్స్ బస్సు. పెట్రోల్ బంక్‌కి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది.




