Watch Video: నాగుల చవితి రోజున అద్భుతం.. శివలింగం దగ్గర పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాములు..
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాగుల చవితి పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది.. నాగులచవితిని పురస్కరించుకుని.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. నాగ దేవతలను పూజిస్తున్నారు. చాలామంది ఉపవాసంతో పలు ఆలయాల్లోని పుట్టల వద్ద నాగుపాములను పూజిస్తున్నారు. పాలతోపాటు.. పలు పదార్థాలను నైవైథ్యంగా సమర్పించి.. మొక్కలు చెల్లించుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాగుల చవితి పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది.. నాగులచవితిని పురస్కరించుకుని.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. నాగ దేవతలను పూజిస్తున్నారు. చాలామంది ఉపవాసంతో పలు ఆలయాల్లోని పుట్టల వద్ద నాగుపాములను పూజిస్తున్నారు. పాలతోపాటు.. పలు పదార్థాలను నైవైథ్యంగా సమర్పించి.. మొక్కలు చెల్లించుకుంటున్నారు. అయితే.. దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఈ నాగుల చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవ సూచికంగా.. నాగుపాములను ఆరాధ్య దేవతలుగా కొలుస్తూ ఈ వేడుకను జరుపుకుంటారు.. పుట్టలో పాలు పోసి.. పూజలు చేసి నాగన్నకు మొక్కులు చెల్లించుకుంటారు.. ముఖ్యంగా ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు.. అయితే.. నాగుల చవితి రోజున అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. శివలింగంపైన పడగవిప్పి రెండు నాగుపాములు నిల్చుని..కనువిందు చేశాయి.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో నాగుల చవితి రోజున రెండు నాగుపాములు కనువిందు చేశాయి.. నాగుల చవితి సందర్భంగా శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో.. గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి చేరుకొని రెండు నాగుపాములు పడగవిప్పి దర్శనమిచ్చాయి..
వీడియో చూడండి..
ఇది చూసి భక్తులు భక్తి తన్మయత్వంతో మునిగిపోయారు.. నాగుల చవితి నాడు.. సాక్షాత్తూ నాగన్న దర్శనమిచ్చాడంటూ రెండు నాగుపాములను చూసి మురిసిపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




