AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ కగార్‌పై కేంద్రం కీలక సమాచారం.. జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతో తెలుసా?

వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్‌ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా పని చేశాయి. ఆపరేషన్ కగార్‌తో కేంద్రం పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లేనా..? ఇప్పటిదాకా ఎంతమందిని అంతమొందించారు..? ఎంతమంది లొంగిపోయారు..? రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా జప్తు చేసిన నక్సల్స్‌ ఆస్తులెంత..? ఈ విషయాలన్నింటికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది..!

ఆపరేషన్‌ కగార్‌పై కేంద్రం కీలక సమాచారం.. జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతో తెలుసా?
Amit Shah On Naxals Copy
Balaraju Goud
|

Updated on: Dec 14, 2025 | 11:52 PM

Share

ఆపరేషన్ కగార్‌తో కేంద్రం పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లేనా..? ఇప్పటిదాకా ఎంతమందిని అంతమొందించారు..? ఎంతమంది లొంగిపోయారు..? రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా జప్తు చేసిన నక్సల్స్‌ ఆస్తులెంత..? ఈ విషయాలన్నింటికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది..!

దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం ఇక గత చరిత్రగానే మిగిలేలా ఉంది. దేశంలో మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర హోంశాఖ పెట్టుకున్న టార్గెట్‌కి ముందే అగ్రనాయకత్వం కథ దాదాపుగా ముగిసింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ సహా పలువురు కీలక నేతలు లొంగిపోవడం చూస్తుంటే.. 60 ఏళ్ల సుదీర్ఘ సాయుధ పోరాటానికి తెరపడినట్లే కనిపిస్తోంది. అయితే… వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్‌ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 92 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు లేటెస్ట్‌గా కేంద్రం ప్రకటించింది.

ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టుల ఆర్థిక మూలాలను కేంద్రం దెబ్బతీసింది. జాతీయ దర్యాప్తు సంస్థ NIA రూ. 40 కోట్లు, ఢిల్లీ పోలీసు అధికారులు రూ. 40 కోట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రూ. 12 కోట్ల విలువైన నక్సల్స్ ఆస్తులను జప్తు చేశాయి. ఇక 2014లో 126 జిల్లాలు నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా.. 2025 నాటికి కేవలం 11 జిల్లాలే మిగిలాయి. ఈ ఏడాది సుమారు 317 మంది నక్సలైట్లు హతమయ్యారు. అలాగే 862 మంది అరెస్టు కాగా.. మరో 1,973 మంది తుపాకులను వదిలి లొంగిపోయారు. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం అభివృద్ధి పనులు కూడా చేపట్టింది. 20వేల 815 కోట్ల రూపాయల విలువ చేసే 17,589 కిలో మీటర్ల రోడ్లు వేయించింది. వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్టాఫీసులు, మొబైల్‌ టవర్ల నిర్మాణం చేపట్టారు.

నక్సలిజం విషపూరితమైన పాముః అమిత్ షా

ఈ నేపథ్యంలోనే మావోయిస్టులపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. నక్సలిజం అంటూ ఆయుధాలు పట్టినవాళ్లకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నక్సలిజం విషపూరితమైన పాము వంటిలాంటిదని… దాన్ని అంతం చేసిన తర్వాతే అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలవుతుందని స్పష్టంచేశారు. వచ్చే ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు.

మొత్తంగా… ఆపరేషన్‌ కగార్‌ క్లైమాక్స్‌కి వచ్చినట్లే కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ డెడ్‌లైన్‌లోపు మావోయిస్టుల ఏరివేతను లక్ష్యంగా పెట్టుకున్న భద్రతాబలగాలు ముందే ఆ పని పూర్తిచేసేలా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..