AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ ఒక్క బైక్‌పై అన్ని చలానాలా..? ఖంగుతిన్న పోలీసులు.. సెకండ్ హ్యాండ్ బండి కొనేవారు తప్పక చదవాల్సిందే..

Vizianagaram: విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. నిత్యం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు ట్రాఫిక్ పోలీసులు. అందులో భాగంగానే ఎక్కువ జరిమానాలు ఉన్న బైక్స్‌పై దృష్టి పెట్టారు. అందుకోసం పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సుమారు 163 వాహనదారుల వద్ద నుంచి..

బాబోయ్ ఒక్క బైక్‌పై అన్ని చలానాలా..? ఖంగుతిన్న పోలీసులు.. సెకండ్ హ్యాండ్ బండి కొనేవారు తప్పక చదవాల్సిందే..
Police Seizing The Bike
Gamidi Koteswara Rao
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 28, 2023 | 4:59 PM

Share

విజయనగరం, జూలై 28: విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. నిత్యం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు ట్రాఫిక్ పోలీసులు. అందులో భాగంగానే ఎక్కువ జరిమానాలు ఉన్న బైక్స్‌పై దృష్టి పెట్టారు. అందుకోసం పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సుమారు 163 వాహనదారుల వద్ద నుంచి చలనాలు వసూలు చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఓ చేదు అనుభవం తప్పలేదు. వాహనాల తనిఖీల్లో భాగంగా అటుగా వస్తున్న ఏపి 31ఈపి 7099 అనే హీరో గ్లామర్ బైక్ ని ఆపి రికార్డ్స్ తనిఖీ చేయటం ప్రారంభించారు పోలీసులు. బైక్ సీబుక్, డ్రైవింగ్ లైసెన్స్ , బైక్ ఇన్స్యూరెన్స్ తో పాటు ఇతర డాక్యుమెంట్స్ చెక్ చేశారు. అవేమీ బైక్ యజమాని వద్ద అందుబాటులో లేవు. తరువాత బైక్‌పై ఉన్న జరిమానాలు పరిశీలించారు.

అంతే.. ఆ జరిమానాలు చూసి పోలీసులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ బైక్ పై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 93 చలానాలు! అవన్నీ కూడా ఆటోమేటిక్ ఈ చలనా సిస్టమ్ ద్వారా పడినవే. పోలీసులు ఖంగు తిన్నారు. చూసింది తప్పేమో అని మరోసారి చెక్ చేశారు. చలానాలు కరెక్టే అని నిర్ధారించుకొని చర్యలకు దిగారు. అయితే తన బైక్ కోసం పోలీసులు చేస్తున్న హడావుడితో బైక్ యజమానికి ముచ్చెమటలు పట్టాయి. ‘అసలు ఇన్ని ఫైన్స్ ఎందుకు ఉన్నాయి? అన్ని సార్లు నిభందనలు ఎలా ఉల్లంఘించావు? నీకు భాధ్యత లేదా’ అని స్వరం పెంచుతూ బైక్ యజమానిని నిలదీశారు పోలీసులు. తాను తప్పు చేయలేదని, వేరే వారి బండి తాను కొనుగోలు చేశానని, జరిమానాలు పెండింగ్ ఉన్నట్టు తనకు తెలియలేదని, ఇప్పుడు మీరు చెక్ చేయటం వల్ల నాకు తెలిసింది అని సమాధానం ఇచ్చాడు బైక్ యజమాని. సరే ఇవన్నీ మాకెందుకు పెండింగ్ చలనాలు అన్ని కట్టాల్సిందే అని పట్టుబట్టారు పోలీసులు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కట్టడానికి సిద్ధమయ్యాడు. వెంటనే పోలీసులు ఫైన్స్ కు సంభందించిన అమౌంట్ అంతా లెక్కేసి పదిహేను వేల ఐదు వందలు పెండింగ్ చలానా ఉందని అంతా ఒక్కసారే కట్టాలని అడిగారు.

నేను చలనా కట్టను – నాకు బండి వద్దు..

దీంతో ఖంగుతిన్న బైక్ యజమాని కొంచెం తమాయించుకొని, కొంత ధైర్యం తెచ్చుకొని ‘నా బైక్ అమ్మినా ఫైన్ అంత డబ్బులు రావు, నేను కట్టను, బైక్ మీరే అమ్ముకొని చలనాల అప్పు తీర్చండి, ఇంకా తీరకపోతే మీరే కట్టుకోండి నాకు సంబంధం లేదు.. వస్తా మరి..’ అని పోలీసులకు ఘాటుగా సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న పోలీసులు షాక్ తిని ఏమి చేయాలో పాలుపోక చివరికి చట్టప్రకారం బైక్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా బైక్ కొన్నప్పుడు సిబుక్, లైసెన్స్, పొల్యూషన్ తో పాటు బైక్ పై ఉన్న చలానాలు కూడా చెక్ చేసి కొనాలని అంటున్నారు. అలా కాకపోతే ఇలాంటి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..