- Telugu News Photo Gallery Technology photos Best smartphones to buy under Rs 20000 in July 2023, Check here for top 5 List
Smartphones: రూ.20 వేల లోపే అద్భుతమైన టాప్ స్మార్ట్‌ఫోన్స్.. అద్దిరిపోయే బ్యాటరీ, కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో..
Smartphones Under 20K: మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కావాలంటే కనీసం 25 వేల రూపాయలను వెచ్చించాల్సిన పరిస్థితి. అయితే ఫోన్ తప్పనిసరి అయిన ఈ కాలంలో కూడా 20 వేల కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన కొన్ని స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే..?
Updated on: Jul 27, 2023 | 7:55 AM

Samsung Galaxy M34 5G: శామ్సంగ్ గెలాక్సీ ఎమ్34 5జీ స్మార్ట్‌ఫోన్(6GB RAM, 128ROM) ధర రూ. 18,999గా ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ బ్యాకప్ వంటి పలు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Realme 10 Pro 5G: రూ. 18,999లకే లభిస్తోన్న రియల్‌మీ 10 ప్రో 5జీ(6GB RAM, 128ROM) స్మార్ట్‌ఫోన్‌లో మీరు 108MP ప్రైమరీ కెమెరాను, 16MP ఫ్రంట్ కెమెరాను పొందుతారు. ఇంకా ఇందులో 5000mAh బ్యాటరీ కూడా అందుబాటు ఉంది.

Tecno Camon 20 Pro 5G: టెక్నో కంపెనీకి చెందిన కేమన్ 20 ప్రో 5జీ(8GB RAM, 256 ROM) సాధారణ ధర రూ.26 వేలు ఉండగా ఇప్పుడు మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.19.390లకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 64MP RGBW OIS ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP బోకె కెమెరాను కలిగిన ట్రిపుల్ కెమెరా సెట్.. సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 33W చార్జింగ్ సప్పోర్ట్‌తో పాటు 5000mAh బ్యాటరీ బ్యాకప్ ఉన్నాయి.

Realme Narzo 60 5G: రియల్‌మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్(8GB RAM, 256 ROM)ను మీరు ఇప్పుడు 19,999లకే పొందవచ్చు. ఈ ఫోన్‌లో మీరు 64MP స్ట్రీట్ ఫోటోగ్రఫీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా కలిగిన ట్రిపుల్ సెట్ కెమెరాను పొందుతారు. ఇంకా 5000mAh బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G: వన్‌ప్లస్ నొర్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్(8GB RAM, 128ROM) అమెజాన్‌లో 19,999లకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో మీరు ఏకంగా 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ అసిస్ట్ లెన్స్, 2MP మాక్రో కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరాను పొందుతారు. ఇంకా ఇందులో 67Wచార్జింగ్ సప్పోర్ట్, 5000 mAh బ్యాటరీ బ్యాకప్ కూడా ఉన్నాయి.





























