AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వై నాట్‌ 175’ అంటోన్న వైసీపీ ఆ స్థానంపై ఆసక్తి చూపించడం లేదా.? ఇంఛార్జిని ఎందుకు ప్రకటించడంలేదు..

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 స్లోగన్ తో ముందుకెళ్తుంది. అసెంబ్లీ స్థానాలు అన్నింటిలో పాగా వెయ్యాలంటూ సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మరి ఎంపీ సీట్ల పరిస్థితి ఏంటని అనుమానం వస్తుంది. రాజధాని అమరావతి ని ఆనుకుని ఉన్న కీలకమైన విజయవాడలో ఈసారైనా వైసీపీ గెలుస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. విజయవాడ ఎంపీగా వరుసగా రెండుసార్లు టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలిచారు..గత ఎన్నికల్లో కేశినేని పై వైసీపీ నుంచి పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు...

'వై నాట్‌ 175' అంటోన్న వైసీపీ ఆ స్థానంపై ఆసక్తి చూపించడం లేదా.? ఇంఛార్జిని ఎందుకు ప్రకటించడంలేదు..
YSRCP
S Haseena
| Edited By: |

Updated on: Jul 28, 2023 | 4:58 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 స్లోగన్ తో ముందుకెళ్తుంది. అసెంబ్లీ స్థానాలు అన్నింటిలో పాగా వెయ్యాలంటూ సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మరి ఎంపీ సీట్ల పరిస్థితి ఏంటని అనుమానం వస్తుంది. రాజధాని అమరావతి ని ఆనుకుని ఉన్న కీలకమైన విజయవాడలో ఈసారైనా వైసీపీ గెలుస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. విజయవాడ ఎంపీగా వరుసగా రెండుసార్లు టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలిచారు..గత ఎన్నికల్లో కేశినేని పై వైసీపీ నుంచి పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పీవీపీ బెజవాడవైపు గానీ వైసీపీ వైపు గానీ కన్నెత్తి కూడా చూడలేదు.సొంత పనులు, ఇతర వ్యవహారాలతో పీవీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ట్విట్టర్ పోస్టింగ్ ల్ ద్వారా తానొకడిని ఉన్నానని గుర్తు చేస్తుంటారు వరప్రసాద్.దీంతో బెజవాడ పార్లమెంట్ పరిధిలో పార్టీకి సరైన నాయకుడు లేక అతీగతీ లేని పరిస్థితి ఏర్పడింది.

ఏళ్లు గడుస్తున్నా ఇంచార్జి నియామకం చేయని అధినేత..

2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు వరప్రసాద్.. అయితే పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక్క అసెంబ్లీ స్తానం టీడీపీ గెలిచింది. మిగిలిన 6 చోట్ల వైసీపీ గెలిచింది. కానీ ఎంపీగా టీడీపీ నుంచి కేసినేని నాని గెలవడం అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితిని చక్కబెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు గెలిచేందుకు అధిష్టానం ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. విజయవాడ పార్లమెంట్ ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కానీ ఎంపీ అభ్యర్థి లేకపోవడం కొన్ని సందర్భాల్లో పార్టీకి సమస్యలు తెచ్చి పెడుతుంది. పీవీపీ స్థానంలో సరైన అభ్యర్థి దొరకడం లేదని…. అందులోనూ టీడీపీని ఎదుర్కొనే బలమైన నాయకుడి కోసం చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు వైసీపీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు జరుగుతుండగా… కీలకమైన స్థానాన్ని ఖాళీగా ఉంచడం పట్ల కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండేదేవరు.?

ఇంతవరకూ విజయవాడ పార్లమెంట్‌కు అభ్యర్థి లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు బరిలో ఉంటారనే చర్చ కొనసాగుతుంది. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని…సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తుండటం. వైసీపీ నాయకులపై పొగడ్తలు కురిపిస్తుండంతో ఆయన వైసీపీలో చేరుతారనే టాక్ మొదలైంది. కేశినేని నాని వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ విషయం పై కేశినేని నాని అనుచరులు గానీ వైసీపీ నేతలు గానీ పెదవి విప్పడం లేదు. అటు చంద్రబాబు పై కేశినేని విమర్శలు చేస్తున్న ప్రతి సందర్భంలో పీవీపీ కౌంటర్ ఇవ్వడం చూస్తే.. మళ్లీ పీవీపీ కూడా సీన్‌లోకి వస్తారా అని కూడా చర్చ జరుగుతుంది. అయితే సీఎం జగన్ మాత్రం ఈ ఇద్దరూ కాకుండా మరో కొత్త వ్యక్తిని విజయవాడ బరిలో నిలబెట్టి విజయం సాధించేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అందుకే ఈ స్థానంలో ఇప్పటివరకూ ఇంఛార్జీని ప్రకటించలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థి ఎవరు అనేది పక్కన పెడితే కీలక స్థానంలో కనీసం ఇంచార్జి కూడా లేకపోవడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు