Trending: ఇదేందయ్యా ఇది, రిజిగ్నేషన్ లెటర్ ఇలా కూడా రాస్తారా..? ఈ క్రియేటివిటీని చూసే ఉద్యోగం ఇచ్చేస్తారుగా..!
Swiggy Instamart's Resignation: మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటే సదరు కంపెనీకి తప్పనిసరిగా రాజీనామా లెటర్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ రిజిగ్నేషన్ లెటర్‌లో మీరు ఉద్యోగం వదిలేయాడానికి..
Swiggy Instamart’s Resignation: మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటే సదరు కంపెనీకి తప్పనిసరిగా రాజీనామా లెటర్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ రిజిగ్నేషన్ లెటర్‌లో మీరు ఉద్యోగం వదిలేయాడానికి గల కారణాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించాలి. ఇవన్నీ మనకు తెలుసు. ఇంకా రిజిగ్నేషన్ లెటర్ ఎలా రాయాలో కూడా మనలో చాలా మందికి ఇదివరకే అనుభవం ఉండే ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రిజిగ్నేషన్ లెటర్ తెగ చక్కర్లు కొడుతోంది.
Swiggy Instamart తన ట్విట్టర్ ఐడీ @SwiggyInstamart నుంచి షేర్ చేసిన ఓ ఫన్నీ పోస్ట్ ఇది. ‘ఇన్‌స్టా మార్ట్‌ని ఉపయోగించి ఉద్యోగాన్ని వదిలేయడం’ అని అర్థమిచ్చే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ రిజిగ్నేషన్ లెటర్ చాలా అంటే చాలా చాలా ఫన్నీగా ఉంది. ఆ లెటర్ చివర్లో ‘మీ నష్టానికి క్షమించండి. మీరు ఒక రత్నాన్ని కోల్పోతున్నారు. ఒకవేళ మీకు తెలిస్తే..’ అని కూడా చమత్కారంగా ఉంటుంది. ఇంకా ఇందులోన పదాల కోసం పెర్క్, గుడ్‌డే బిస్కెట్, 5 స్టార్ చాక్లెట్, లిటిల్ హార్ట్స్ బిస్కెట్ వంటివి ఉపయోగించడం మరింత ఫన్నీగా ఉంది.
how to quit your job using Instamart 🚶♀️ pic.twitter.com/CyhSDyvWaq
— Swiggy Instamart (@SwiggyInstamart) July 24, 2023
ఇక వైరల్ అవుతున్న ఈ రిజిగ్నేషన్ లెటర్‌పై నెటిజన్లు సరదా సరదాగా స్పందిస్తున్నారు. మీలోని క్రియేటివిటీకి పరిమితులు లేవని, అద్భుతమైన పోస్ట్ అని పలువురు చెప్పుకొచ్చారు. ‘జాగ్రత్త మీ ఉద్యోగులు కూడా ఇలాగే చేయగలరు, అనవసరమైన ఐడియాలు ఇవ్వకండి’ అని ఇంకొందరు ఇన్‌స్టామార్ట్‌కి సూచించారు.