Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గుట్కాతో ఐస్‌క్రీమ్ తయారీ..! ‘గరుఢ పురాణంలో కూడా లేని ఘోరమైన శిక్ష’ అంటున్న నెటిజన్లు..

Gutka Ice Cream: చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్స్‌లో ఐస్ క్రీమ్‌కి ప్రముఖ స్థానం ఉంది. ఇక ఈ ఐస్ క్రీమ్‌ని రుచి కోసం అనేక రకాల ఫ్లేవర్లను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ క్రమంలోనే బంగారు పూతతో..

Watch Video: గుట్కాతో ఐస్‌క్రీమ్ తయారీ..! ‘గరుఢ పురాణంలో కూడా లేని ఘోరమైన శిక్ష’ అంటున్న నెటిజన్లు..
Gutka Ice Cream Making
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 24, 2023 | 1:25 PM

Gutka Ice Cream: చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్స్‌లో ఐస్ క్రీమ్‌కి ప్రముఖ స్థానం ఉంది. ఇక ఈ ఐస్ క్రీమ్‌ని రుచి కోసం అనేక రకాల ఫ్లేవర్లను ఉపయోగించి తయారు చేస్తారు. ఇంకా బంగారు పూతతో తయారు చేసిన ఐస్ క్రీమ్‌లను విక్రయించే రెస్టారెంట్లు మన దేశంలోనే లేకపోలేదు. అయితే ఓ ఐస్ క్రీమ్ స్టాల్ వ్యక్తి తయార్ చేసిన ఐస్క్రీమ్‌ని, దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు నిప్పులు ఎగసిపడినట్లు  మండిపడుతున్నారు. అసలు ఆ ఐస్‌క్రీమ్‌ విషయంలో నెటిజ్లు ఎందుకు కోపం వ్యక్తం చేస్తున్నారంటే..?

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి గుట్కాను ఉపయోగించి ఐస్‌క్రీమ్‌ని తయారు చేశాడు. ఇంకా దాన్ని తన స్టాల్ వద్దకు వచ్చిన కస్టమర్స్‌కి ఇవ్వబోతున్నాడు. వీడియో కొన్ని సెకన్లే ఉన్నప్పటికీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Younickviralvlogs అనే ఇన్‌స్టా ఐడీ నుంచి షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపుగా 2 లక్షల వరకు లైకులు వచ్చాయి. ఇంకా లక్షలాది మంది దీన్ని వీక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఐస్‌క్రీమ్ తయారుచేసిన వ్యక్తిపై మండిపడుతున్నారు. ‘ప్రపంచం అంతమైపోవడానికి సమయం దగ్గరపడింది’.. ‘తినేవారు దీన్ని చూస్తే వాంతులు చేసుకుంటారు, యాక్’.. ‘ఉమ్మేయాల్సిన గుట్కాని మింగాలా, వామ్మో’.. ‘గరుడ పురాణంలో కూడా ఇంతకంటే దారుణమైన శిక్షలు లేవు’ అని పలువురు రాసుకొస్తున్నారు. ఇంకా ఈ వీడియోను సరదాగా తమ స్నేహితులకు షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..