బావిలో పడ్డ జింకను రక్షించిన గ్రామస్థులు.. దప్పిక తీర్చుకోవడానికి వచ్చి..
Khammam District: అడవుల్లో ఉండే జంతువులు అడవులను వదిలి గ్రామాల్లోకి వస్తున్నాయి. అడవులు అంతరించిపోవటంతో పాటు అడవుల్లో నీరు దొరకక జనం సంచారించే ప్రాంతాలకు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. అడవిలో..

ఖమ్మం జిల్లా న్యూస్, జూలై 24: అడవుల్లో ఉండే జంతువులు అడవులను వదిలి గ్రామాల్లోకి వస్తున్నాయి. అడవులు అంతరించిపోవటంతో పాటు అడవుల్లో నీరు దొరకక జనం సంచారించే ప్రాంతాలకు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. అడవిలో సంచారించే ఓ జింక అరణ్యాన్ని వదిలి గ్రామం బాట పట్టింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో జింక కనిపించింది.
గ్రామ సమీపంలో దట్టమైన చెట్లు ఉండటంతో వాటి నుంచి బయటకు వచ్చిన జింక దప్పిక తీర్చుకోవటానికి బావి వద్దకు వచ్చి అందులో పడింది. జింక బయటికి రాలేక ఆ బావిలోనే ఉండిపోయింది. అది గమనించిన గ్రామస్తులు జింకను బయటికి తీసి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దీనితో తమ గ్రామంలోకి జింక వచ్చిందని విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు చూడటానికి తండోపతండాలుగా వచ్చారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.