Prahlad Joshi: ‘ముందు మిమ్మల్ని మీరు నమ్మండి’.. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు..

Union Minister Prahlad Joshi: ప్రతిపక్షాలు ముందుగా తమలో తాము విశ్వాసం పెంపొందించుకొని, ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం గురించి మాట్లాడితే బాగుంటుందని కేంద్ర మంద్రి ప్రహ్లాద్ జోషి విపక్షాలపై ఎద్దేవా చేశారు. INDIA కూటమిలోని ప్రతిపక్షాలు..

Prahlad Joshi: ‘ముందు మిమ్మల్ని మీరు నమ్మండి’.. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు..
Union Minister prahlad Joshi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 27, 2023 | 12:05 PM

Union Minister Prahlad Joshi: ప్రతిపక్షాలు ముందుగా తమలో తాము విశ్వాసం పెంపొందించుకొని, ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం గురించి మాట్లాడితే బాగుంటుందని కేంద్ర మంద్రి ప్రహ్లాద్ జోషి విపక్షాలపై ఎద్దేవా చేశారు. INDIA కూటమిలోని ప్రతిపక్షాలు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతుందన్న ప్రచారంపై ఘాటుగా స్పందించిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన పాత వైఖరి ప్రకారమే ఇతర ప్రతిపక్షాలతో అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించలేదని, ముందుగా విపక్షాలు పరస్పర విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నారు.

ఇంకా ప్రధాని మోదీ, బీజేపీపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి భంగపడ్డాయని, ఇప్పుడూ అదేలా చేసి మరోసారి నిరాశపడబోతున్నాయని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం, నల్లని దుస్తులు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, మణిపూర్ ఘటనపై చర్చించాలని డిమాండ్ చేస్తే తాము ఆంగీకరించామని, ఇప్పుడు అవిశ్వాస తిర్మానం అంటూ పార్లమెంట్ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని జోషీ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..