ఎత్తైన టవర్ 13వ అంతస్తులో దూరిన కొండచిలువ హల్‌చల్..! ఆ తర్వాత..
ఎక్కడ్నుంచి వచ్చింది..? ఎలా వచ్చిందో తెలియదు గానీ, ఆ కొండచిలువ ఏకంగా 13 అంతస్తుల పైకి చేరుకుంది. ఆ టవర్ అంత ఎత్తుకు కొండచిలువ ఎలా చేరిందో తెలియక అక్కడ నివసించే ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ఒకింత భయంతో వణికిపోయారు. అంతలోనే..
ముంబైలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఘాట్‌కోపర్ ప్రాంతంలో నాలుగు అడుగుల కొండచిలువ హల్‌చల్ చేసింది. ఎక్కడ్నుంచి వచ్చింది..? ఎలా వచ్చిందో తెలియదు గానీ, ఆ కొండచిలువ ఏకంగా 13 అంతస్తుల పైకి చేరుకుంది. అయితే జంతు ప్రేమికులు దీనిపై అటవీశాఖకు సమాచారం అందించగా, అటవీశాఖ అధికారులు దానిని రక్షించారు. ఆ టవర్ అంత ఎత్తుకు కొండచిలువ ఎలా చేరిందో తెలియక అక్కడ నివసించే ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ఒకింత భయంతో వణికిపోయారు.
ముంబైలోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్న జంతు కార్యకర్త సూరజ్ సాహా మంగళవారం ఘాట్‌కోపర్ (పశ్చిమ) ఎల్‌బిఎస్ రోడ్‌లోని వ్రాజ్ ప్యారడైజ్ భవనం టెర్రస్‌పై ఇండియన్ రాక్ పైథాన్ కనిపించిందని తెలిపారు. టెర్రస్‌పై కొన్ని నిర్మాణ పనులు జరుగుతుండడంతో కొండచిలువ పూర్తిగా సిమెంట్‌లో పడిపోయి కనిపించిందన్నారు. వెంటనే దాన్ని రక్షించేందుకు రాష్ట్ర అటవీ శాఖను సంప్రదించామని చెప్పారు.
రక్షిత వన్యప్రాణుల జాతి అయిన కొండచిలువను రక్షించేందుకు ముంబై రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాకేష్ భోయిర్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. కొండచిలువను చూసిన తర్వాత, ఎవరూ దానికి హాని చేయడానికి ప్రయత్నించలేదని చెప్పారు. వన్యప్రాణుల అవగాహన కారణంగా, ప్రజలు పాములను గాయపరచడం, చంపడం చట్టవిరుద్ధమని ఇక్కడి ప్రజలకు అవగాహన ఉందని చెప్పారు. అటవీశాఖ అధికారులు దానిని పట్టుకుని అక్కడ్నుంచి తరలించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..