Viral Video: ‘పా..పా.. పాము! వాయమ్మో రక్షించండి’ చెట్టు కింద నిద్రపోతున్న వ్యక్తి చొక్కాలో దూరిన కోబ్రా..

అనుకోకుండా ఎప్పుడైనా పాము కంటపడితే మీరైతే ఏంచేస్తారు. వెనకా ముందూ చూడకుండా లగెత్తడమే.. అని అంటారు కదా. అదే కోబ్రా పాము దగ్గరగా.. మరీ ఒళ్లోకి వస్తే ఏం చేస్తారు..? ఇంకేముంది భయంతో గుండె ఆగినా..

Viral Video: 'పా..పా.. పాము! వాయమ్మో రక్షించండి' చెట్టు కింద నిద్రపోతున్న వ్యక్తి చొక్కాలో దూరిన కోబ్రా..
Snake Entres Man's Shirt
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 27, 2023 | 12:36 PM

అనుకోకుండా ఎప్పుడైనా పాము కంటపడితే మీరైతే ఏంచేస్తారు. వెనకా ముందూ చూడకుండా లగెత్తడమే.. అని అంటారు కదా. అదే కోబ్రా పాము దగ్గరగా.. మరీ ఒళ్లోకి వస్తే ఏం చేస్తారు..? ఇంకేముంది భయంతో గుండె ఆగినా ఆశ్చర్యపడక్కర్లేదు అనుకుంటున్నారా..? ఐతే మీరు ఈ వీడియో చూడాల్సిందే..

తాజాగా ఓ వ్యక్తి చల్లగా ఉంది కదా అని ఓ పార్క్‌లో చెట్టు కింద ఓ కునుకు తీశాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పె..ద్ద.. కోబ్రా పాము అక్కడికి వచ్చింది. చెట్టు నీడలో కాస్త వెచ్చగా బజ్జోవాలనిపించిందేమో.. మెల్లగా అక్కడే నిద్రపోతున్న సదరు వ్యక్తి చొక్కాలో దూరిపోయింది. పాము గారికి ఉక్కపోసిందేమో.. చొక్కా బటన్‌లో నుంచి తల బయటికి పెట్టి తొంగి చూడసాగింది. ఇంతలో సదరు వ్యక్తికి మెలకువొచ్చి చొక్కాలో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఎదురుగా కోబ్రా తల కనిపించేసరికి భయంతో గజగజ వణికిపోయాడు. పాపం.. బిక్కమోహం వేసి రక్షించండి మహప్రభో అని వేడుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇంతలో చుట్టుపక్కలున్నవారు అతని వద్దకు చేరుకుని మెల్లగా చొక్కా గుండీలు తొలగించారు. ఏమనుకుందో పాము కూడా ఎలాంటి హాని తలపెట్టకుండా చొక్కాలోనుంచి బయటికొచ్చీ.. చక్కగా దాని మానాన అది వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేస్కోండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.