Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుమ్మడి గింజపై చంద్రబాబు…సూక్ష్మ కళాకారుడి అద్భుత సృష్టి.. బాబు అపాయింట్‌మెంట్‌ దొరికింది..!

Guntur: పెన్సిల్ పై బొమ్మలు చెక్కడం చూశాం... అలాగే చాక్ పీస్ ఆర్ట్ చూశాం... ఇంకా వరి గింజపై పేర్లు చెక్కడం విన్నాం చూశాం... కానీ ఆయన ఏకంగా గుమ్మడి గింజపై తన అభిమాన రాజకీయ నాయకుడి బొమ్మను చెక్కాడు. అంతేకాదు ఆ గింజను కుటుంబంతో కలిసి తమ నాయకుడికి చూపించి ఆనందించారు కూడా.

Andhra Pradesh: గుమ్మడి గింజపై చంద్రబాబు...సూక్ష్మ కళాకారుడి అద్భుత సృష్టి.. బాబు అపాయింట్‌మెంట్‌ దొరికింది..!
Chandrababu Image On Pumpkin
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 27, 2023 | 1:16 PM

గుంటూరు,జులై 27: పెన్సిల్ పై బొమ్మలు చెక్కడం చూశాం… అలాగే చాక్ పీస్ ఆర్ట్ చూశాం… ఇంకా వరి గింజపై పేర్లు చెక్కడం విన్నాం చూశాం… కానీ ఆయన ఏకంగా గుమ్మడి గింజపై తన అభిమాన రాజకీయ నాయకుడి బొమ్మను చెక్కాడు. అంతేకాదు ఆ గింజను కుటుంబంతో కలిసి తమ నాయకుడికి చూపించి ఆనందించారు కూడా. తెనాలికి చెందిన అవనిగడ్డ శివ నాగేశ్వరావు కువైట్ లో నివసిస్తుంటారు. అక్కడ‌చిత్రకళా ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయనకు సూక్ష్మ చిత్ర కళపై పట్టుంది. దీంతో ఆయన ఎవరూ చేయని గింజలపై తమ అభిమాన రాజకీయ నాయకుడైనా చంద్రబాబు ఫోటో చెక్కాలనుకున్నారు.

అనుకున్నదే తడువుగా అందమైన గుమ్మడి గింజను ఎన్నుకున్నారు. తనకు ప్రావీణ్యం ఉన్న కళ ద్వారా అందమైన చంద్రబాబు బొమ్మను దానిపై చెక్కారు. ఎప్పటికైనా దానిని చంద్రబాబుకు చూపించాలని ఆశించారు. వారు అనుకున్నట్లుగానే నిన్న చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరికింది. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలిసి గుమ్మడి గింజను చూపించి ఆయనకు బహూకరించారు. దానితో పాటు సూక్ష్మ చిత్ర కళా ఆల్బమ్ ను చంద్రబాబుకు చూపించారు.

సూక్ష్మ చిత్ర కళను తమ అభిమాన నాయకుడైన చంద్రబాబు మెచ్చుకోవడం ఆ కుటుంబ సభ్యులను మరింతగా ఆనందానికి గురి చేసింది. చంద్రబాబుతో సెల్ఫి దిగి అక్కడి నుండి తెనాలి వచ్చేసింది ఆ కుటుంబం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..