AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Tirupati: అలంకార ప్రియుడు వెంకన్న ఆస్తులు తెలిస్తే షాక్.. 11 టన్నుల బంగారం, 17000 కోట్ల నగదు బ్యాంక్ లో డిపాజిట్

వారణాసిలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో వెంకన్న ఆస్తుల వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని.. ఇప్పుడు రోజు లక్ష మందికి పైగా శ్రీవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. అదే స్థాయిలో శ్రీవారి ఆదాయం కూడా భారీగా పెరిగిందని చెప్పారు. 

Tirumala Tirupati: అలంకార ప్రియుడు వెంకన్న ఆస్తులు తెలిస్తే షాక్..  11 టన్నుల బంగారం, 17000 కోట్ల నగదు బ్యాంక్ లో డిపాజిట్
Venkanna Gold Ornaments
Surya Kala
|

Updated on: Jul 27, 2023 | 11:51 AM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల శ్రీ వేంకటేశ్వ స్వామిని దర్శించుకోవడానికి ప్రతి హిందువు కోరుకుంటాడు. కోరుకున్న కోర్కెలు తీర్చే దైవంగా భావించి అలంకార ప్రియుడైన వెంకన్నకు కానుకలు, విరాళాలు ఇస్తూ ఉంటారు. దీంతో శ్రీవారి దగ్గర విలువైన నగలు, వజ్రాలు ఉన్నాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకూ అలనాటి రాజులు, చక్రవర్తులు, నవాబులు, బ్రిటీష్ పాలకులతో పాటు.. నేటి కాలం  ప్రజాప్రతినిధులు ఎన్నో విరాళాలు, కానుకలు ఇచ్చారు. టీటీడీ రికార్డుల ప్రకారం శ్రీవారి ఖజానాలోని విలువైన నగల బరువు 11 టన్నులు. ఈ నగలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. అదే సమయంలో  వెంకన్న ఖాతాలో రూ.17 వేల కోట్ల నగదును టీటీడీ జమ చేసింది.

తాజాగా వారణాసిలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో వెంకన్న ఆస్తుల వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని.. ఇప్పుడు రోజు లక్ష మందికి పైగా శ్రీవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. అదే స్థాయిలో శ్రీవారి ఆదాయం కూడా భారీగా పెరిగిందని చెప్పారు.

దేశవ్యాప్తంగా 71 దేవాలయాల నిర్వహణ ప్రసాదాల విక్రయం గదుల కేటాయింపు, విరాళాలు మొదలైన వాటి ద్వారా టీటీడీకి ఆదాయం వస్తుంది. వారణాసి సదస్సులో ఆస్తుల వివరాలతో పాటు టీటీడీకి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. టీటీడీ దేశవ్యాప్తంగా 71 ఆలయాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారిని  అలంకరించేందుకు ఉపయోగించే బంగారు ఆభరణాలు 1.2 కిలోలు, వెండి 10 టన్నులు అని టీటీడీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఏటా 500 టన్నుల పూలను అలంకరణకు ఉపయోగిస్తారు అదే సమయంలో వివిధ బ్యాంకుల్లో ఇప్పటివరకు రూ.17 వేల కోట్లు, 11 టన్నుల బంగారం డిపాజిట్ చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. అలాగే తిరుమలేశుని అలంకరణకు ఏటా 500 టన్నుల పూలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 24500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు రోజూ 800 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రసాదం తయారీకి ఏటా 5 వేల టన్నుల నెయ్యి వినియోగిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అంతేకాదు శ్రీవారికి ఆస్తిగా  6000 ఎకరాల అటవీ ప్రాంతం ఉందని టీటీడీ ఆస్తుల చిట్టాలోనూ పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..