Astro Tips: ప్రతి ఒక్కరూ ఈ అలవాట్లు చేసుకోండి.. ప్రతి రోజూ పాటిస్తే.. జీవితం ఆనందం మాయమే..

మనిషి నడవడిక చేసే పనులతో కూడా శుభఫలితాలను పొందుతారు. రోజువారీ చేసే పనులతో,  పరిహారాలతో శుభాలను చాలా ఈజీగా పొందవచ్చు. ముఖ్యంగా రోజూ కొన్ని విషయాలను పాటిస్తూ ఉంటే.. మంచి రోజులు వస్తాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు నమస్కారం చేసి, వారి ఆశీస్సులు తీసుకోండి. తద్వారా సత్ఫలితాలు పొందండి.

Astro Tips: ప్రతి ఒక్కరూ ఈ అలవాట్లు చేసుకోండి.. ప్రతి రోజూ పాటిస్తే.. జీవితం ఆనందం మాయమే..
Build A Good Habits
Follow us
Surya Kala

|

Updated on: Jul 27, 2023 | 8:10 AM

గ్రహాల ప్రభావం రాశులపై చూపిస్తుంది. ఈ గ్రహాల స్థితితో వ్యక్తులకు శుభా, అశుబాల ఫలితాలు నెలకొంటాయి. అదే సమయంలో మనిషి నడవడిక చేసే పనులతో కూడా శుభఫలితాలను పొందుతారు. రోజువారీ చేసే పనులతో, పరిహారాలతో శుభాలను చాలా ఈజీగా పొందవచ్చు. ముఖ్యంగా రోజూ కొన్ని విషయాలను పాటిస్తూ ఉంటే.. మంచి రోజులు వస్తాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

రోజూ అలవాటు చేసుకోవాల్సిన విషయాలు.. 

1. ఉదయం నిద్రలేచిన వెంటనే తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు నమస్కారం చేసి, వారి ఆశీస్సులు తీసుకోండి. తద్వారా సత్ఫలితాలు పొందండి.

ఇవి కూడా చదవండి

2. ప్రతిరోజూ ఆవుకి బెల్లం-ఆహారం అందించండి. వీలైతే ఆవును పూజించి ‘కామధేనువు కోరుకున్న పని జరిపించమని’ ప్రార్ధించండి.

3. కుక్కలకు రోజూ ఆహారం అందించండి. అంతేకాదు పక్షులకు కూడా ఆహారం ఇస్తే శుభప్రదం.

4. మీరున్న నగరం లేదా గ్రామానికి సమీపంలో చెరువు, నది లేదా సముద్రం ఉన్నట్లయితే, చేపలకు, తాబేళ్లకు ఆహారాన్ని అందించండి.

5. ప్రతిరోజూ కాకులు ఆహారాన్ని అందించండి.

6. ఇంటికి వచ్చిన అతిథులకు నిస్వార్థంగా సేవ చేయండి. అతిథులకు ఆహారాన్ని మనస్ఫూర్తిగా అందించండి.

7.  రోజూ ఉదయం భోజనం చేసే సమయంలో.. అగ్నిదేవుడికి ఆహారాన్ని సమర్పించండి.. అంతేకాదు ఆహారంలో నెయ్యి, బెల్లం కలిపి బృహస్పతికి సమర్పించాలి. దీంతో అన్నపూర్ణదేవి కూడా సంతోషిస్తోంది.

8. ఉదయం స్నానం చేసి శివలింగానికి నీటిని సమర్పించి, 108 సార్లు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని పఠించండి.

9. ఉదయాన్నే తలస్నానం చేసి.. సూర్యనారాయణుడికి ఎర్రటి పువ్వులతో అర్ఘ్యం సమర్పించి, చేతులు జోడించి నమస్కారం చేయాలి.

10. ప్రతి శనివారం రావి చెట్టుకు కొద్దిగా నీరు, పచ్చి పాలు నైవేద్యంగా పెట్టి.. ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. సూర్యుడిని, శివయ్యను, రావి చెట్టుని క్రమపద్ధతిలో పూజించి నైవేద్యాన్ని సమర్పించి.. పితృ దేవాయ నమః అని 4 సార్లు చెప్పండి. రాహువు. – కేతువు, శని-పిత్ర దోషాలు పరిష్కారమవుతాయి.

11. ఉదయాన్నే సూర్యునికి ఎదురుగా కూర్చుని, భగవత్ భజన లేదా మంత్రం లేదా గురు మంత్రాన్ని   జపించండి.

12. మీ శక్తి మేరకు పేదలకు ఏదైనా దానం చేయండి.

13. ఎవరికైనా ఏదైనా అవసరానికి ఆదుకున్న తర్వాత కీర్తి పొందాలనే భావన కలిగి ఉండకండి.

14. తినకూడని వస్తువులను ఎన్నటికీ తినే ప్రయత్నం చేయవద్దు.

15. ప్రతి జీవి పట్ల దయ, ఆప్యాయత, సేవా భావాన్ని కలిగి ఉండండి.

16. ఆదివారం లేదా మంగళవారం రుణం తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే బుధవారం నాడు రుణం తీసుకోండి.

17. రుణాలను మంగళవారం నాడు తిరిగి చెల్లించాలి. సంక్రాంతి, వృద్ధి యోగం లేదా హస్తా నక్షత్రం ఉన్నట్లయితే అప్పు తీసుకోకూడదని గుర్తుంచుకోండి.

18. ఇంట్లోని మొదటిగా తయారు చేసే ఆహారం ఆవుకి, చివరి రొట్టెని కుక్కకు క్రమం తప్పకుండా ఇవ్వండి, అప్పుడు ఇంట్లో సుఖ సంపదలకు లోటు లేకుండా.. ఉంటుంది.

19. పితృ దోషం నుండి విముక్తి పొందడానికి, క్రమం తప్పకుండా మహాగాయత్రి మహామంత్రాన్ని జపించండి.    శ్రీ రామేశ్వర ధామాన్ని సందర్శించండి. శివయ్యను పూజించండి.

20. గోర్లు శుక్రవారం కత్తిరించవచ్చు. అంతేకాని పొరపాటున కూడా గురువారం గోర్లు కత్తిరించుకోవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?