Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsaptak Yoga: శని కుజుడుల కలయికతో ఈ రాశు వారికి అన్నీ కష్టాలే.. ఆగష్టు 18 వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలైలో కుజుడు సింహరాశిలోకి ప్రవేశించాడు.. అదే సమయంలో శనీశ్వరుడు  కుంభరాశిలో ముఖాముఖిగా ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు ఈ స్థితిలో ఉన్నప్పుడు సంసప్తక రాజయోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ యోగంలో కొన్ని రాశుల వారికి కష్టాలు తీరనున్నాయి.  అదే సమయంలో కొన్ని రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి..   

Samsaptak Yoga: శని కుజుడుల కలయికతో ఈ రాశు వారికి అన్నీ కష్టాలే.. ఆగష్టు 18 వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే..
Samsaptak Yoga
Follow us
Surya Kala

|

Updated on: Jul 27, 2023 | 7:26 AM

ప్రతి గ్రహం తన ప్రయాణానికి నిర్ణీత సమయాన్ని కలిగి ఉంటుంది. గ్రహాలు తమ నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేయడం వలన ఆయా రాశులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో జూలైలో సింహరాశిలోకి ప్రవేశించిన అంగారకుడు ఆగస్టు 18 వరకు ఈ రాశిలో ఉండనున్నాడు. అంగారకుడు అగ్ని కారకుడు.. కనుక సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు చాలా కోపంగా ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలైలో కుజుడు సింహరాశిలోకి ప్రవేశించాడు.. అదే సమయంలో శనీశ్వరుడు  కుంభరాశిలో ముఖాముఖిగా ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు ఈ స్థితిలో ఉన్నప్పుడు సంసప్తక రాజయోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ యోగంలో కొన్ని రాశుల వారికి కష్టాలు తీరనున్నాయి.  అదే సమయంలో కొన్ని రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి..

కన్య రాశి: ఈ రాశి వ్యక్తులపై సంసప్తక యోగ ప్రభావం కనిపిస్తుంది. ఈ సమయంలో నాడీ, ఛాతీ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాలలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.  అంతే కాదు ఈ రాశి వ్యక్తుల తల్లి ఆరోగ్యం కూడా ఆందోళన నెలకొంటుంది. పని చేసే ప్రదేశంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇల్లు, వాహనం కోసం ఖర్చు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

తుల రాశి

శనీశ్వరుడు, కుజుడు ముఖాముఖిగా వచ్చినప్పుడు.. ఈ రాశి వ్యక్తులు చేసే పనిలో అదృష్టం కలిసి వస్తుంది.  సోదరులు, స్నేహితుల సహకారం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. మరోవైపు  తండ్రి గాయపడవచ్చు లేదా ఆపరేషన్ జరగవచ్చు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది.

వృశ్చిక రాశి

ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి.  చేసే పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంది. కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనారోగ్యం కోసం అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉంటుంది. మాట్లాడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలను పెంచుతాయి.

మకరరాశి

జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వ్యక్తుల మాట తీరులో తీవ్రత నెలకొంటుంది. కుటుంబ వ్యవహారాల్లో అధిక  ఖర్చులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. పాత శత్రువులతో ఇబ్బందులు పడతారు. పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చు.. ఆందోళన కరంగా మారవచ్చు.

మీనరాశి

శనీశ్వరుడు, కుజుడు ముఖాముఖీగా ఉండడం వల్ల ఈ రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో ఛాతీకి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు నాడీ సమస్య ఏర్పడవచ్చు. తల్లి ఆరోగ్యం ఆందోళనను పెంచుతుంది. గృహ, వాహన సంబంధమైన వాటి విషయంలో టెన్షన్ నెలకొంటుంది. ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. తండ్రితో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే