Zodiac Signs: నీచలో చంద్రుడు.. మీ ఆర్థిక రహస్యాల గురించి ఇతరులతో చర్చించకండి..!

ఈ నెల 28, 29 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో నీచపడడం జరుగుతోంది. వృశ్చిక రాశిని జ్యోతిష శాస్త్రంలో ‘గుంభన స్థానం’గా వ్యవహరిస్తారు. మనఃకారకుడైన చంద్రుడు ఇటువంటి గుంభన స్థానంలో, అంటే రహస్య స్థానంలో, నీచబడితే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

Zodiac Signs: నీచలో చంద్రుడు.. మీ ఆర్థిక రహస్యాల గురించి ఇతరులతో చర్చించకండి..!
మేషం : ఈ యోగం వల్ల మేష రాశి వారికి సంతానం కలుగుతుంది. అలాగే ఇంత కాలం కష్టాలు పడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది. ఇది కాకుండా, మీరు ఆర్థిక ఆఫర్లను కనుగొంటారు.
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 26, 2023 | 10:15 PM

Zodiac Signs: ఈ నెల 28, 29 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో నీచపడడం జరుగుతోంది. వృశ్చిక రాశిని జ్యోతిష శాస్త్రంలో ‘గుంభన స్థానం’గా వ్యవహరిస్తారు. మనఃకారకుడైన చంద్రుడు ఇటువంటి గుంభన స్థానంలో, అంటే రహస్య స్థానంలో, నీచబడితే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. వృశ్చిక రాశిలో చంద్ర సంచారం రెండు రోజులే అయినప్పటికీ, ఈ రెండు రోజులు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు, ఆలోచనల ప్రభావం చాలా కాలం పాటు కొనసాగుతుంది. అందు వల్ల ఈ రెండు రోజుల్లో ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ముత్యపు ఉంగరం ధరించడం వల్ల, దుర్గాదేవిని స్తుతించడం వల్ల ఈ ‘నీచ’ ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చంద్ర గ్రహం నీచపడడం వల్ల ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు అనుభవానికి వస్తాయన్నది పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశికి అష్టమ రాశిలో, అంటే రహస్య స్థానంలో చంద్రుడు నీచబడడం వల్ల మీ మనసులో చాలా కాలం నుంచి దాచుకుంటున్న రహస్యాలలో ఒకటైనా బయటపడే అవకాశం ఉంటుంది. మానసికంగా కొద్దిగా బలహీనపడడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్య లకు, మాతృవర్గం వారితో విరోధాలకు కూడా అవకాశం ఉంది. బంధు మిత్రులతోనే కాకుండా, కుటుంబ సభ్యులతో సైతం ఆచితూచి వ్యవహరించడం, అతిగా మాట్లాడకపోవడం చాలా మంచిది.
  2. వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతున్నందువల్ల, సంసార జీవితంలో పారదర్శ కత లోపించడం, ఒక వ్యవహారంలో రహస్యంగా వ్యవహరించడం, మనసులో రహస్యాన్ని దాచుకోవాల్సి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. వ్యసనమేదో పట్టుకునే సూచనలు కూడా ఉన్నాయి. అనవసర పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగక పోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొద్దిగా సమతూకంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.
  3. మిథునం: ఎవరికో రహస్యంగా ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. కొందరు మిత్రులు శత్రువులగా మారే సూచనలు కూడా ఉన్నాయి. జూదాల్లో డబ్బు పెట్టి నష్టపోవడం జరుగుతుంది. అనవసర విష యాల్లో తలదూర్చడం, లేనిపోని సమస్యలను నెత్తిన వేసుకోవడం, వదంతులను ప్రచారం చేయ డం, మాతృవర్గం వారితో వివాదానికి దిగడం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ మాట లను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడానికి కూడా వీలుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
  4. కర్కాటకం: మీ ఆలోచనలను మీలోనే ఉంచుకోవడం మంచిది. మీ ప్రయత్నాలను ఇతరులకు వెల్లడి చేయడం వల్ల నష్టపోతారు. ప్రతి విషయాన్నీ, ప్రతివారినీ నమ్మేయడం శ్రేయస్కరం కాదు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మీ మీద అకారణంగా అపవాదులు, అపనిందలు పడే అవ కాశం ఉంది. ఎవరినీ ప్రస్తుతానికి విశ్వాసంలోకి తీసుకోవద్దు. మీ బలాలు, బలహీనతలు బయటపెట్టుకోవద్దు. కుటుంబ పెద్దలతో వ్యవహరించేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి.
  5. సింహం: ఇతరులను అనవసరంగా లేదా అతిగా విమర్శించడం మంచిది కాదు. చాటుగా కూడా ఎవరి గురించీ చెడుగా మాట్లాడవద్దు. దీనివల్ల అధికారుల నుంచి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. తల్లితో గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులు విమర్శించడానికి, తప్పుపట్టడానికి అవకాశం ఇవ్వ వద్దు. స్నేహితులతో కలిసి విందుల్లో పాల్గొనడం వల్ల స్వల్పంగా అనారోగ్యం వచ్చే సూచన లున్నాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులను సైతం నమ్మకపోవడం శ్రేయస్కరం.
  6. కన్య: ఆస్తి వివాదానికి సంబంధించి ఈ రాశివారి మనసులోని ఆలోచనలు బయటికి వెల్లడయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సోదర వర్గం నుంచి సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సమస్యలను ఎక్కడా ప్రస్తావించవద్దు. ప్రేమ వ్యవహారాలను బయటపెట్టడానికి ఇది సమయం కాదు. కొత్త ప్రయత్నాలను, నిర్ణయాలను ప్రస్తుతానికి మనసులోనే ఉంచుకోవడం మంచిది. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం శ్రేయస్కరం కాదు. ప్రయాణాలలో సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండడం అవసరం.
  7. తుల: రహస్య శత్రువులు తయారవుతారు. మీ మీద దాడి చేయడానికి రెడీగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీ పురోగతిని చూసి అసూయతో ఉడికిపోతున్న వారు బయటికి వస్తారు. మీకు జరిగే మంచిని ఇతరులతో ఎక్కువగా పంచుకోకపోవడం మంచిది. ఆర్థిక విషయాల గురించి ఇతరులతో చర్చించకపోవడం శ్రేయస్కరం. ఆర్థిక ప్రయత్నాలను రెండు రోజుల వాయిదా వేయాల్సిన అవసరం ఉంది. కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్తగా అవసరం.
  8. వృశ్చికం: ఈ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నందువల్ల, మీరు తలపెట్టిన కార్యాలను చెడగొట్టే వారుంటారు. ప్రతి విషయంలోనూ వీలైనంత రహస్యంగా, గోప్యంగా ఉండడం మంచిది. అనవసర స్నేహాలకు దూరంగా ఉండాలి. డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాని గురించి బయట వెల్లడి చేయకపోవడం అవసరం. మానసిక బలహీనత ఏర్పడే సూచనలున్నాయి. మాతృవర్గం వారి వల్ల అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.
  9. ధనుస్సు: కొన్ని ముఖ్యమైన విషయాలను రహస్యంగా ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వృత్తి,ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచడమే మంచిది. కొందరు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మనసులోని బాధలు తొలగిపోవడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి చోటు చేసుకుంటాయి. తల్లి లేదా తల్లి వైపు వారి నుంచి ప్రేమాభిమానాలు చూరగొంటారు. విదేశాల నుంచి ఆశించిన ముఖ్య సమాచారం అందుతుంది.
  10. మకరం: వృత్తి, ఉద్యోగాలపరంగా మీకు సమయం అనుకూలంగా ఉండడం చూసి అసూయ పడేవారుంటారు. మీ గురించి కొందరు పనిగట్టుకుని చెడు ప్రచారం చేయడం, చాడీలు చెప్పడం వంటివి జరుగుతాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభించడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటి కొన్ని సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ సభ్యులతో తప్ప మీ పురోగతిని ఇతరులతో పంచుకోవడం ప్రస్తుతానికి మంచిది కాదు.
  11. కుంభం: లాటరీలు, జూదాలు, వడ్డీ వ్యాపారాలు, షేర్లు వంటి వల్ల డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కాకుండా అనధికార, రహస్య, ఇతర మార్గాలలో ఆదాయం సమకూ రడం జరుగుతుంది. అవినీతి లేదా అక్రమ మార్గాలలో సంపాదన పెరిగే అవకాశం కూడా ఉంది. మీ రహస్యాలను మీ మనసులోనే ఉంచుకోవడం మంచిది. మిత్రుల కారణంగా మీ మనసులోని విషయాలు, వ్యవహారాలు బయటపడడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది.
  12. మీనం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జప తపాలకు ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. కొన్ని రకాల రహస్య లేదా గుప్త విద్యలలో ప్రవేశించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు మూడో కంటికి తెలియకుండా డబ్బు దాచుకోవడం జరుగుతుంది. తండ్రి లేదా తండ్రి వైపు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. అనుకోకుండా కొందరు శత్రువులు మిత్రులుగా మారడం జరుగుతుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి