Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..

Horoscope Today (27th July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..
Horoscope 27th July 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 27, 2023 | 5:01 AM

Horoscope Today (27th July): జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనల వల్ల బాగా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అతి తక్కువ సమయంలోనే చక్కబడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. అయితే, ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల ద్వారా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. మీ వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గంతో సఖ్యత పెరుగు తుంది. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. అదనపు సంపా దనకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ప్రయాణాల వల్ల ఇబ్బంది ఉంటుంది. ఇంటా బయటా పనిభారం ఎక్కువగానే ఉన్నప్పటికీ అత్యవసర పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ప్రముఖులతో పరిచయాల వల్ల గుర్తింపుతో పాటు ప్రయోజనాలు కూడా పొందుతారు. ఆర్థిక ప్రయత్నాల్లో కొంత వరకూ సఫలం అవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడడం వల్ల అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటు ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయం పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహా రాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ప్రస్తుతానికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మీద శ్రద్ధ పెట్టాలి. వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను మాత్రమే గడిస్తారు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): పిల్లలకు సంబంధించిన ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ముఖ్యమైన విషయాల్లో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో అధికారులతో సామరస్యంగా వ్యవహరిస్తారు. పనితీరుకు గుర్తింపు, ప్రతిఫలం లభి స్తాయి. వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. వృత్తి జీవితంలో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. ఇంటి పరిస్థితులను చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): సాధారణ సమస్యలను కూడా భూతద్దంలో చూసి ఆందోళన చెందే అవకాశం ఉంది. అనవసర కబుర్లను, విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. సన్నిహిత మిత్రుల నుంచి సహాయ సహ కారాలు అందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రయత్నాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదా యంలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడుతుండడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం సంపాదించుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయావకాశాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్య మైన వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువుల విషయంలో సంతృప్తి చెందుతారు. అనుకోకుండా మంచి పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హకాలు అందుతాయి. బంధువులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితు లను కలుసుకుంటారు. వ్యాపారాల్లో పోటీ సమస్యల నుంచి బయటపడతారు. వ్యక్తిగత విష యాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులను అదుపు చేస్తారు. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టి మనశ్శాంతి ఏర్పడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సామాజికంగా గౌరవ సత్కా రాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక ఉండకపోవచ్చు. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు కుంటారు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..