Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

Horoscope Today (26th July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope 26th July 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 26, 2023 | 5:57 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. చిన్ననాటి మిత్రులతో మంచి కాలక్షేపం చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కొందరు బంధువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా అనుకూల వాతావరణం నెలకొని ఉంది. శత్రు సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు తప్ప కుండా సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు మిత్రుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఇంటా బయటా అదనపు బాధ్యతలుంటాయి. మానసిక చికాకులుంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలను కార్యరూపంలో పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులు వీటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బంధువులు, స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కీలక విషయాల్లో ఎటూ నిర్ణయం తీసుకోలేక అవస్థ పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో సంపాద నకు లోటు ఉండదు. ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు నిరాశపరిచే సూచనలున్నాయి. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కొందరు బంధువులు ముఖ్యమైన వ్యవహారాలలో సహాయపడతారు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఇతరుల వ్యవహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. అవమానాల పాలయ్యే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ అప్ర మత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొందరు బంధువులతో కాలక్షేపం చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సొంత లాభం కొంత మానుకుని ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాలలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభ కార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులు, వినోదాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. విదేశాల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, మద్య వ్యాపారులు బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాలు లభించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొద్దిగా ప్రతికూల తలు కనిపిస్తాయి. సాధారణ వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగు లకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలను ఆచరణలో పెట్టడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి. స్తోమతకు మించి స్నేహితులకు సహాయపడతారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి