Andhra Pradesh: అడవి మధ్యలో వెలసిన అమ్మవారు.. సూర్యాస్తమయం వరకు మాత్రమే దర్శనాలు.. ఏందుకో తెలుసా..?

West Godavari: ఆ గుడి ఎంతో ప్రత్యేకం. సాయంత్రం 5 గంటల తరువాత నరమానవుడు అక్కడ కనిపించడు. ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం ను సైతం మూసి వేస్తారు. అసలా గుడిలో దైవాన్ని సూర్యాస్తమయం తరువాత ఎందుకు దర్శించుకోకూడదు, భక్తులు ఎందుకు ఆ సాహసం చేయరు.

Andhra Pradesh: అడవి మధ్యలో వెలసిన అమ్మవారు.. సూర్యాస్తమయం వరకు మాత్రమే దర్శనాలు.. ఏందుకో తెలుసా..?
Gubbala Mangamma Thalli
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 27, 2023 | 5:16 PM

ఏలూరు, జులై27: టెన్ టు ఫయవ్ ఈ టైమింగ్ సహజంగా స్కూల్ పిల్లలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. ఇక ఆసుపత్రులైతే 24 గంటలు పని చేస్తాయి. ఆలయాల్లో సైతం దేవుడిని తెల్లవారుజామున సుప్రభాతం తర్వాత నుంచి రాత్రి పవలింపు సేవ వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు.కానీ, ఏపీలోని ఆ గుడి మాత్రం ప్రత్యేకం. సాయంత్రం 5 గంటల తరువాత నరమానవుడు అక్కడ కనిపించడు. ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం ను సైతం మూసి వేస్తారు. అసలా గుడిలో దైవాన్ని సూర్యాస్తమయం తరువాత ఎందుకు దర్శించుకోకూడదు, భక్తులు ఎందుకు ఆ సాహసం చేయరు. తెలుసు కోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి.

తెలంగాణ లో సమ్మక్క సారక్క వనజాతర అందరికీ తెలుసు. ఇలాగే ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ని దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలమంగమ్మ ఆలయం ఉంది.ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభువని చెబుతారు. పూర్తిగా గిరిజన గ్రామాలు మీదుగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా ప్రాంతాల ప్రజలు ఆలయానికి చేరుకుంటారు.

గుబ్బల మంగమ్మ స్థలపురాణం

ఇవి కూడా చదవండి

ఇక్కడ స్థానికులు చెప్పే వివరాలు ప్రకారం గుబ్బల మంగమ్మ ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది ఉంది. సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెబుతారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసం లోనూ ఇక్కడ సంచరించినట్లు కథనాలు ఉన్నాయి. ఇక కొన్ని దశాబ్ధాల క్రితం బుట్టాయగూడెం కు చెందిన వెదురు కర్రలు వ్యాపారి కరాటం క్రృష్ణమూర్తి తన అనుచరులతో ఈ ప్రాంతం నుంచి ఎద్దుల బండ్లు పై కలిప తీసుకువస్తున్నారట అయితే ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రాంతానికీ రాగానే బండ్లు ఎంత ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో అక్కడే వాటిని వదిలి ఇంటికి వెళ్లి పోయారట. అదే రోజు రాత్రి క్రృష్ణమూర్తి కలలో కనిపించి తాను అక్కడే కొండల్లో వెలిసి ఉన్నట్లు చెప్పిందట. గుబ్బల మంగమ్మ దేవత గురించి మరో కథనం ప్రకారం పూర్వం రాక్షసులు మధ్య భీకర యుద్ధం జరిగిందంట. ఆసమయంలో తన ఆలయం కూలిపోవడంతో ఆగ్రహంతో గుబ్బల మంగమ్మ రాక్షసులు అందరినీ సంచరించినట్లు చెబుతున్నారు. అందుకే గొడుగు ఆకారంలో ఉన్న కొండగుహలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. గుహ పై భాగం గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది. అందుకే మంగమ్మ తల్లి ఆలయాన్ని గుబ్బల మంగమ్మ ఆలయంగా పిలువబడుతుంది. ఈ వ్రృత్తాంతం తెలుసుకున్న క్రృష్ణమూర్తి తెల్లవారగానే స్ధానికులుతో కలిసి అక్కడకు చేరుకుని శిధిలదశలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని గుర్తించి ఆలయంగా మలిచి పూజలు చేయటం ప్రారంభించారు.

దట్టమైన అరణ్యంలో ఆలయం..

బుట్టాయగూడెం ఏజెన్సీలో దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలమంగమ్మ ఆలయం ఉంటుంది. జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట మీదుగా అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. అయితే ఆలయం దారిలో కొండవాగులు వర్షాకాలంలో పొంగిపొర్లుతుండటంతో. దీంతో వర్షాలు అధికంగా పడే సమయంలో ఆలయంలోకి భక్తులను అనుమతించరు. అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమాత్రం అక్కడ పని చేయవు. దీంతో పాటు జనసంచారం, నివాసాలకు దూరంగా ఉన్న ప్రాంతం కావటంతో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల తరువాత భక్తులు ఎవ్వరినీ ఆలయ పరిసరాల్లో ఉండనివ్వరు. గుడికి వెళ్లే దారులను సైతం మొదట్లోనే మూసివేస్తారు.

ఎవరి పూజలు వాళ్లే చేసుకోవాలి..

గుబ్బల మంగమ్మ ఆలయం పూర్తిగా అక్కడ ఉండే గిరిజనుల అధీనంలోనే ఉంటుంది. అక్కడే స్ధానికులు కమిటీ గా ఏర్పడి ఆలయం నిర్వహణ చూస్తారు. అయితే ఇక్కడ పూజారుల విధానం లేదు. ఎవరికి వారు అమ్మవారిని దర్శించుకుని , నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. గతంలో గుహలోపలకి వెళ్లి అమ్మవారి విగ్రహంకు నేరుగా పూజలు చేసేవారు అయితే ప్రస్తుతం గుహ మొదట్లోనే ఐరన్ గ్రిల్స్ వేయటంతో బయట నుంచే అమ్మ వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అక్కడ ఉండే గానుగ చెట్టుకు ముడుపులు చెల్లిస్తారు.

వాటర్ ఫాల్స్ మధ్యలో అమ్మవారు..

మండుటెండల్లో సైతం అమ్మవారు కొలువుతీరిన గుహపై నుంచి నీరు జాలువారుతుంటుంది. బండలు, కొండరాళ్ల మధ్యలో నీళ్లపాయలో నడుచుకుంటూ వెంటి జలపాతాల్లో తడుస్తూ భక్తులు దేవతను దర్శించుకుంటారు. ఏమాత్రం బాహ్య ప్రపంచానికి సంబంధంలేని అటవీ ప్రాంతంలో అందమైన పచ్చటి చెట్లు, జలపాతాల మధ్య కొలువైన వనదేవత గా గుబ్బల మంగమ్మ ఆలయం ఖ్యాతి పొందింది.

ఇక్కడ ప్రకృతి దేవత గుబ్బల మంగమ్మ. అందమైన వనాలను కాపాడుకుంటే ఆధ్యాత్మిక వాతావరణం పదిలంగా ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..