మీ పిల్లల మెదడు షార్ప్‌గా పని చేయాలా.. లేటు చేయకుండా ఈ ఫుడ్ పెట్టండి మరి!
samatha
27 April 2025
Credit: Instagram
చిన్న పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా ధృఢంగా, ఉండాలంటే వారికి మంచి ఆహారం ఇవ్వాలని చెబుతుంటారు మన పెద్దవారు.
పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగాలంటే కూడా తప్పకుండా మచి ఆహారం, వారి మెదడు చురుకుగా పని చేసే ఫుడ్ పెట్టాలి.
కాగా, అసలు ఎలాంటి ఫుడ్ పెట్టడం వలన పిల్లలమైండ్ షార్ప్ గా పని చేస్తుంది. దీని గురించి వైద్యులు సజెస్ట్ చేస్తున్న ఆహారం ఏదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం
ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రతి రోజూ ఒక గుడ్డు పెట్టడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీనిలో విటమిన్ బి12, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మెంతి, పాలకూర, కూరగాయలతో వండిన ఫుడ్ పిల్లలకు ప్రతి రోజూ పెట్టాలి. దీని వలన వారు బలంగా, ఆరోగ్యంగా ఉంటారు.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువలన వీటిని ప్రతి రోజూ పిల్లలకు పెట్టడం వలన అవి ఇవి మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలను తినడం ద్వారా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి.
ఓట్స్, బ్రౌన్ రైస్, ధాన్యాలు, గోధుమ రొట్టెల్లో కార్బోహైడ్రేట్లు, B-విటమిన్లు ఉంటాయి. వీటిని ప్రతి రోజూ పెట్టడం వలన పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది.