పిల్లికి గుడికట్టి పూజలు.. పండుగ పేరిట జాతరలు.. ఆనాదిగా వస్తున్న వింత ఆచారం.. ఎక్కడో తెలుసా..

ఇళ్లలో కూడా పిల్లులను పూజిస్తారు. గ్రామంలో ఎవరూ పిల్లులకు హాని చేయరు. అలా చేసిన వారికి అశుభం కలుగుతుందని గ్రామస్తులు అంటున్నారు. అలాంటి వారిని గ్రామం నుండి తరిమికొడతారు. అంతేకాదు, గ్రామంలో ఎవరికైనా పిల్లి కళేబరం కనిపిస్తే, దానిని..

పిల్లికి గుడికట్టి పూజలు.. పండుగ పేరిట జాతరలు.. ఆనాదిగా వస్తున్న వింత ఆచారం.. ఎక్కడో తెలుసా..
Cats Rare Temple
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2023 | 4:55 PM

కర్నాటకలోని మైసూర్ సమీపంలో గల బెకలేల గ్రామంలో ఓ వింత ఆచారం కొనసాగుతుంది. ఇక్కడ పిల్లులను పూజించే ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం మంగమా దేవాలయం. మైసూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్యలోని మద్దూర్ తాలూకాలో గల బెకలాలే గ్రామంలో ఈ వింత ఆరాధన కొనసాగుతోంది. కన్నడలో పిల్లికి ‘బేకు’ అనే పదం నుండి ఈ గ్రామానికి బెకలలే అనే పేరు వచ్చింది. గ్రామస్తులు యేడాదికోసారి తప్పక పిల్లి జాతర,ఆరాధనలో భాగంగా పండుగను కూడా నిర్వహిస్తారు.

ఈ గ్రామం మాండ్యతుమకూరు జిల్లా సరిహద్దులో ఉంది. ఇక్కడ పిల్లులను పూజించేందుకు ప్రత్యేక దేవాలయం కూడా ఉంది. పిల్లులను మహాలక్ష్మికి ప్రతిరూపంగా పూజిస్తారు. లక్ష్మీదేవి పిల్లి రూపంలో గ్రామానికి వచ్చి తమను ఆపద నుంచి కాపాడిందని గ్రామస్తుల నమ్మకం. కృతజ్ఞతా చిహ్నంగా పిల్లులను పూజిస్తారు. ఈ ఆరాధన 1000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని ఆలయంలో పూజలు చేసే కుటుంబానికి చెందిన బసవరాధ్యుడు తెలిపారు.

ఇకపోతే, ఇక్కడ పిల్లులను పూజించే మంకమ్మ దేవాలయం ఒకదానికొకటి నిర్మించబడిన మూడు దేవాలయాల కలయిక. గ్రామంలోని ముగ్గురు కుటుంబ సభ్యులు ఆలయాలను నిర్మించారు. ఇక్కడ దేవత పిల్లి విగ్రహం. ఈ ఆలయాన్ని 60 సంవత్సరాల క్రితం ప్రస్తుత రూపంలో పునరుద్ధరించారు. ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందులో పలువురు గ్రామస్తులు పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి సందర్శకులు వస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

జ్యోతిష్యులు గుర్తించిన శుభ సమయంలో గ్రామంలో మంగమ్మ పండుగను జరుపుకుంటారు. మూడు నాలుగు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. దాదాపు ఎనిమిది వందల కుటుంబాలున్న గ్రామంలోని చాలా ఇళ్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పిల్లులు కనిపిస్తాయి. ఇళ్లలో కూడా పిల్లులను పూజిస్తారు. గ్రామంలో ఎవరూ పిల్లులకు హాని చేయరు. అలా చేసిన వారికి అశుభం కలుగుతుందని గ్రామస్తులు అంటున్నారు. అలాంటి వారిని గ్రామం నుండి తరిమికొడతారు. అంతేకాదు, గ్రామంలో ఎవరికైనా పిల్లి కళేబరం కనిపిస్తే, దానిని దహనం చేయకుండా కనిపెట్టిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లకూడదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..