Watch Video: మందు తాగిందా ఏందీ! నడిరోడ్డుపై చిత్ర విచిత్రమైన ఆసనాలేస్తోన్న ఎలుగుబంటి.. చూస్తే నవ్వాపుకోలేరు..
Viral News: మద్యం తాగిన వ్యక్తులు ఎలా చేస్తారు? ఇంకేముంది.. నానా యాగీ చేస్తారు. పడుతూ లేస్తూ, దొర్లుతూ హంగామా చేస్తారు. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. మనుషులు ఇలా చేస్తారు.. మరి జంతువులు మందు తాగితే ఎలా చేస్తాయో తెలుసా? ఇంకేముంది మనుషుల్లాగే అవి కూడా చిత్ర విచిత్రంగా చేస్తాయి.
Viral Video: మద్యం తాగిన వ్యక్తులు ఎలా చేస్తారు? ఇంకేముంది.. నానా యాగీ చేస్తారు. పడుతూ లేస్తూ, దొర్లుతూ హంగామా చేస్తారు. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. మనుషులు ఇలా చేస్తారు.. మరి జంతువులు మందు తాగితే ఎలా చేస్తాయో తెలుసా? ఇంకేముంది మనుషుల్లాగే అవి కూడా చిత్ర విచిత్రంగా చేస్తాయి. కాకపోతే వాటి చర్యలు కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి నడిరోడ్డుపై నడుచుకుంటూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అడుగులు తడబడుతూ, గాల్లోనే తలుపులు వెతుకుతున్నట్లుగా వింత చేష్టలు చేసింది.
ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @buitengebieden పేరుతో ఉన్న యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఎలుగుబంటి అలా ప్రవర్తించడంపై తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మందు తాగిన తరువాత నా పరిస్థితి కూడా ఇదేనని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. కరెంట్ సమయంలో వాష్ రూమ్ డోర్ ఎక్కడ ఉందో అని వెతుక్కోవడానికి నేను కూడా ఇలాగే చేస్తానంటూ మరొకరు రెస్పాండ్ అయ్యారు.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Me trying to find the bathroom switch in the middle of the night.. 😂 pic.twitter.com/bYQFQNu4lA
— Buitengebieden (@buitengebieden) July 26, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..