AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల రోజుల్లోనే రూ.3 కోట్ల ఆదాయం.. చిత్తూరు రైతు విజయ రహస్యం ఏమిటంటే..?

Chittoor District News: ప్రస్తుతం టమాటా పంట రైతులకు సిరులపంటగా మారింది. టమాటా తోట ఉన్నవారు ఉన్నపాటుగా కోటేశ్వరులైపోతున్నారు. మెదక్ జిల్లాలో మహిపాల్ రెడ్డి ఇప్పటికే రూ.2 కోట్ల టమాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు ఏకంగా రూ.3 కోట్ల ఆదాయం..

నెల రోజుల్లోనే రూ.3 కోట్ల ఆదాయం.. చిత్తూరు రైతు విజయ రహస్యం ఏమిటంటే..?
Chandramouli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 25, 2023 | 12:51 PM

Share

చిత్తూర్ జిల్లా, జూలై 25: ప్రస్తుతం టమాటా పంట రైతులకు సిరులపంటగా మారింది. టమాటా తోట ఉన్నవారు ఉన్నపాటుగా కోటేశ్వరులైపోతున్నారు. మెదక్ జిల్లాలో మహిపాల్ రెడ్డి ఇప్పటికే రూ.2 కోట్ల విలువ చేసే టమాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు నెల రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్ల ఆదాయం గడించాడు. చిత్తూరు జిల్లాకు చెందిన సోమల మండలం కరకమందకు చెందిన చంద్రమౌళి తన తమ్ముడు మురళి, తల్లి రాజమ్మతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నాడు. సొంతూరు కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపుపల్లెలో 20 ఎకరాల పొలం కలిగిన చంద్రమౌళి కుటుంబం ఏళ్ల నుంచి టమాటా సాగును పండిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రమౌళి ఈ సారి కూడా తమ పొలంలో అదే పండను వేశారు.

అంతే.. మార్కెట్‌లో కేజీ టమాట ధర రూ.150 నుంచి రూ.180 వరకు ఉండడంతో చంద్రమౌళి చేసిన 22 ఏకరాల టమాటా సాగు బంగారు పంటగా మారింది. జూన్, జూలై నాటికి పంట చేతికి వచ్చేలా సాగు చేయడం కలిసి వచ్చిందని చంద్రమౌళి చెబుతున్నారు. కట్టెసాగు విధానంలో మల్చింగ్‌, సూక్ష్మ సేద్య పద్ధతులు పాటించామని.. జూన్‌ చివరిలో దిగుబడి మొదలవ్వగా కర్ణాటకలోని కోలార్‌ మార్కెట్‌లో విక్రయించామని చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌లో 15 కిలోల టమాట బాక్స్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 మధ్య పలికింది. ఈ క్రమంలో 40 వేల పెట్టెలను చంద్రమౌళి విక్రయించగా రూ. 4 కోట్లు ఆదాయం వచ్చిందని.. 22 ఎకరాలకు పెట్టుబడి రూపంలో రూ.70 లక్షలు కాగా, కమీషన్‌గా 20 లక్షలు, రవాణా ఖర్చులు 10 లక్షలు అయినట్లు తెలిపారు.మొత్తం ఖర్చులు పోగా చేతికి రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని చంద్రమౌళి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Follow Us
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..
అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్..
అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్..
కోహ్లీ కంటే ఖతర్నాక్.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు
కోహ్లీ కంటే ఖతర్నాక్.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు