Yawning: అతిగా ఆవలిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. ఆవలింత ఈ సమస్యలకు లక్షణమే కావచ్చు..

సినీదర్శకుడు రామ్ గోపావ్ వర్మపై గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ ఆర్జీవి చేసిన ట్వీట్ ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌పై సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Yawning: అతిగా ఆవలిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. ఆవలింత ఈ సమస్యలకు లక్షణమే కావచ్చు..
Yawning
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 25, 2023 | 1:18 PM

Yawning: శరీరం అలసట లేదా విసుగు చెందినప్పుడు అలసట రావడం సర్వసాధారణమైన లక్షణం. ఆవలింత అనేది తాత్కాలికంగా హృదయ స్పందన రేటు, శరీర చురుకుదనాన్ని పెంచే కొన్ని హార్మోన్ల కారణంగా వస్తుందని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా తన అధ్యాయనాల ద్వారా పేర్కొంది. అయితే ఓ వ్యక్తి 15 నిముషాల వ్యవధిలోనే 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఆవలిస్తే అతనిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాట్లని సదరు యూనివర్సిటీ పేర్కొంది. విపరీతమైన ఆవలింత కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా సంభవిస్తుందని తెలిపింది. మరి ఆవలింతను లక్షణంగా కలిగిన ఆ సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం..

నిద్రలేమి: శరీరానికి సరిపడినంతగా నిద్ర లేకపోతే ఆవలింతలు వస్తుంటాయి. రానున్న కాలంలో ఇది మానసిక సమస్యగా, ఒత్తిడి ఆందోళనకు దారితీస్తుంది.

మెడిసిన్స్: మెడిసిన్స్‌ని అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆవలింతలు వస్తుంటాయి. మెడిసిన్స్ కారణంగా కలిగే మగతు భావన శ్వాస పదేపదే ఆగిపోయేలా చేస్తుంది. మెడిసిన్స్ పరిమితిని తగ్గించకుంటే శరీరంపై సైడ్ ఎఫ్పెక్ట్స్ చూపిస్తాయి.

ఇవి కూడా చదవండి

మెదడు సమస్యలు: ఆవలింతలకు కూడా మెదడు సమస్యలు కూడా కారణం కావచ్చు. పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, మైగ్రేన్ వంటి సమస్యల కారణంగా ఆవలింతలు వస్తాయి.

ఆందోళన లేదా ఒత్తిడి: ఆవలింత కూడా  ఆందోళన, ఒత్తిడికి ఒక లక్షణమే. ఈ సమస్యల నుంచి బయటపడకుంటే రానున్న కాలంలో కేశ, చర్మ సమస్యలు కలిగే ప్రమాదం ఉంది.

గుండెపోటు: చుట్టూ ఉన్న వాతావరణంలో తగినంత ఆక్సిజన్ లేకున్నా కూడా ఆవలింతలు వస్తుంటాయి. ఇలాంటి వాతావరణం కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..