AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Seediri Appalaraju: నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల వ్యవదిలో ఎన్నికలు.. కేడర్‌కి స్పష్టం చేసిన మంత్రి..

Srikakulam News: పూర్తి కాలం అధికారంలో ఉండేకే ఎన్నికలకు వెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలతో ఎన్నికలపై ఏపీ ప్రజలు అయోమయానికి గురవుతూ ఉంటే.. ఉత్తరాంధ్రకు చెందిన ఓ రాష్ట్ర మంత్రి తన క్యాడర్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరిలోనే ఏపీలో ఎన్నికలకు..

Minister Seediri Appalaraju: నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల వ్యవదిలో ఎన్నికలు.. కేడర్‌కి స్పష్టం చేసిన మంత్రి..
Minister Seediri Appalaraju
S Srinivasa Rao
| Edited By: Sanjay Kasula|

Updated on: Jul 28, 2023 | 8:31 PM

Share

శ్రీకాకుళం, జూలై 28: ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని.. డిసెంబర్ లోనే ఎన్నికలు ఉండొచ్చని ప్రతిపక్ష నేతలు చెబుతు వస్తున్నారు. ముందుస్తు ఎన్నికలకు వెళ్లేదే లేదు… పూర్తి కాలం అధికారంలో ఉండేకే ఎన్నికలకు వెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలతో ఎన్నికలపై ఏపీ ప్రజలు అయోమయానికి గురవుతూ ఉంటే.. ఉత్తరాంధ్రకు చెందిన ఓ రాష్ట్ర మంత్రి తన క్యాడర్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరిలోనే ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఉంటుందని…నోటిఫికేషన్ వచ్చిన నెల రోజులకే ఎన్నికలు ఉంటాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు,బూత్ కన్వీనర్ల సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పలాస నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించేందుకు అంతా కలిసి కట్టుగా పని చేయాలని మంత్రి సూచించారు.

2024 లో ఎన్నికలు అంటే… అంతా చాలా సమయం ఉందన్న ధీమాలో ఉన్నారని…కానీ సమయం కేవలం ఆరు నెలలు మాత్రమే ఉందనేది అంతా గుర్తు పెట్టుకోవాలని మంత్రి అన్నారు. కేడర్ అంతా నేటి నుండే మిషన్ మోడ్ లో పని చేయాలన్నారు. ఓటు హక్కుకు అర్హులైన 18 ఏళ్ల నుండి పార్టీ పట్ల అనుకూలంగా ఉన్న యువతీ,యువకులను గుర్తించి వారిని ఓటర్లుగా చేర్చాలని అన్నారు మంత్రి అప్పలరాజు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం