AP Rains: కూల్ న్యూస్.. ఇక భారీ వర్షాలు తగ్గినట్టే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తాంద్రలో కేంద్రీకృతమై ఉందని.. దీని ప్రభావం కారణంగా రాష్ట్రమంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో..

AP Rains: కూల్ న్యూస్.. ఇక భారీ వర్షాలు తగ్గినట్టే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
Heavy Rainfall
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2023 | 7:56 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తాంద్రలో కేంద్రీకృతమై ఉందని.. దీని ప్రభావం కారణంగా రాష్ట్రమంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఉత్తర కోస్తాంద్ర & యానాం:

శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ అధికారులు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:

శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:

రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకట్రెండు ప్రాంతాల్లో పడే ఛాన్స్, 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశముంది.