AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ‎లో ఎలక్షన్ కౌంటింగ్ ఫీవర్.. బెట్టింగ్ బ్యాచ్‎పై ప్రత్యేక ఫోకస్..

ఎన్నికల ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొన్నా, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‎లో కౌంటింగ్ ఫీవర్ నడుస్తోంది. ఏ స్థాయికి చేరిందంటే మేమే అధికారంలోకి వస్తామంటూ వైఎస్ఆర్సీపీ, టీడీపీ సానుభూతిపరులు ఒకరికొకరు పంతాలు, పందాలు కాస్తున్నారు. ఏకంగా కోట్లల్లో బెట్టింగ్‎లు వేస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారాలపై దృష్టి పెట్టింది టీవీ9. ఈ నిఘాలో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగు చూసాయి.

ఏపీ‎లో ఎలక్షన్ కౌంటింగ్ ఫీవర్.. బెట్టింగ్ బ్యాచ్‎పై ప్రత్యేక ఫోకస్..
Ap Result Counting
Eswar Chennupalli
| Edited By: |

Updated on: May 31, 2024 | 9:31 PM

Share

ఎన్నికల ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొన్నా, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‎లో కౌంటింగ్ ఫీవర్ నడుస్తోంది. ఏ స్థాయికి చేరిందంటే మేమే అధికారంలోకి వస్తామంటూ వైఎస్ఆర్సీపీ, టీడీపీ సానుభూతిపరులు ఒకరికొకరు పంతాలు, పందాలు కాస్తున్నారు. ఏకంగా కోట్లల్లో బెట్టింగ్‎లు వేస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారాలపై దృష్టి పెట్టింది టీవీ9. ఈ నిఘాలో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగు చూసాయి. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఆ పార్టీ సానుభూతిపరుడైన రియల్టర్ ఒకరు కోటి రూపాయల పందెం కాశారు. దానికి ప్రతిగా ఏకంగా రూ.10 లక్షలు అడ్వాన్స్‎తో పాటు నాలుగు కోట్ల విలువచేసే ల్యాండ్ పేపర్ల‎తో వచ్చాడు ఓ టీడీపీ మద్దతుదారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే కాదు, వైజాగ్ సిటీ లో ఎన్ని సీట్లు గెలుస్తుంది? వ్యక్తిగతంగా ఎవరెవరు గెలుస్తున్నారంటూ విచ్చలవిడిగా వారిద్దరి మధ్య సంవాదం నడించింది.

కౌంటింగ్ దగ్గర పడేకొద్దీ..

పోలింగ్ ముగిసి జూన్ 4 కౌంటింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏ ఇద్దరు ఒక చోట కలిసినా, ఏ వాట్సాప్ గ్రూపు చూసినా చివరికి అది బెట్టింగ్ అంశంతోనే నడుస్తూ ఉంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకూ మినహాయింపు ఉండడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో మూడు రాజకీయ చర్చలు.. ఆరు బెట్టింగులు అన్నట్లుగా చర్చ జరుగుతూ ఉందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు ఏస్థాయిలో ఉందో.

ఈ స్థానాలపై ఐపిఎల్ ను మించి ఆసక్తికర బెట్టింగ్..

రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల విజయాలపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం, షర్మిల పోటీ చేస్తున్న కడప స్థానాల్లో గెలుపు, మెజార్టీలపై జోరుగా పందేలు కడుతున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ కల్యాణ్ ఓడిపోవడంతో ఈసారి కూడా పిఠాపురంలో ఓడిపోతారని వైసిపి బలంగా నమ్ముతోంది. అందుకే పందేలకు సిద్ధం అవుతున్నారు. పవన్ మెజార్టీపై పందెంరాయుళ్లు లక్షకు మూడు లక్షలు బెట్టింగులు పెడుతున్నారట. ఏపీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేస్తున్న కడప ఎంపీ స్థానంపైనా బెట్టింగ్ రాయుళ్ళ దృష్టి పడింది. వైసీపీ నుంచి బరిలో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల ఆరోపణల నేపథ్యంలో ఈ అక్కాతమ్ముళ్ల మధ్య పోరుపై ఆసక్తి నెలకొంది. దీంతో కడప ఎంపీ సీటుపై కూడా పందెంరాయుళ్లు కన్నేశారు. అదే సమయంలో గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన లోకేష్ విజయం సాధించాలని టీడీపీ ఆశిస్తోంది. దీంతో మంగళగిరిలో లోకేష్ గెలుపుపైనా కూడా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారని సమాచారం. ఇవి ఐపిఎల్‎ను మించి జరుగుతున్నట్టు ప్రచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…