అయ్యో కళ్ళముందే దారుణం.. లోయలోపడిన బైక్.. గాల్లో కలిసిన ప్రాణాలు..
భార్య,భర్త, కొడుకు, కూతురు..! నలుగురూ కలిసి బైక్‌పై వెళ్తున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొద్ది దూరంలోనే గమ్యస్థానం చేరుకోనున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఓ కుదుపు.. తెరుకునే లోపే లోయలోకి బైక్ వెళ్లిపోయింది. చెల్లా చెదురుగా ఒక్కొక్కరు ఒక్కో వైపు పడ్డారు. తల్లి, కూతుళ్లు గాయలతో రక్తం కారుతూ సాయం కోసం హాహాకారాలు చేస్తున్నారు. భర్త, కొడుకు వచ్చి కాపాడతారేమోనని అనుకున్నారు.

భార్య,భర్త, కొడుకు, కూతురు..! నలుగురూ కలిసి బైక్‌పై వెళ్తున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొద్ది దూరంలోనే గమ్యస్థానం చేరుకోనున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఓ కుదుపు.. తెరుకునే లోపే లోయలోకి బైక్ వెళ్లిపోయింది. చెల్లా చెదురుగా ఒక్కొక్కరు ఒక్కో వైపు పడ్డారు. తల్లి, కూతుళ్లు గాయలతో రక్తం కారుతూ సాయం కోసం హాహాకారాలు చేస్తున్నారు. భర్త, కొడుకు వచ్చి కాపాడతారేమోనని అనుకున్నారు. కానీ.. ఆ ఇద్దరూ కళ్ళముందే విగత జీవులుగా మారారు. అల్లూరి జిల్లా కొయ్యూరు ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరి ప్రాణాలు బలిగొంది. మరో ఇద్దరు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రి పాలయ్యారు. చింతలవానిపాలెం సమీపంలో బైక్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కొయ్యూరు మండలంలోని చింతవానిపాలెం ఘాట్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకులు మృతి చెందారు. అడ్డతీగల మండలంలోని సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్ళారు. అనంతరం శుక్రవారం ఉదయం తిరిగి తమ గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ చింతవానిపాలెం ఘాట్‌కు వెళ్ళే సరికి ఒక్కసారిగా బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి. దీంతో బైక్ అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్ళి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాంబాబు, అతడి కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రాంబాబు భార్య కాసులమ్మ, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తల్లి కూతుళ్లకు ప్రధమ చికిత్స అందించిన అనంతరం 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను మార్చురికి తరలించారు. కళ్ళముందే భర్త, కొడుకును కోల్పోయిన కాసులమ్మ కన్నీరు మున్నీరై విలపిస్తుండడం అందరిని కలచి వేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




