Vijay Deverakonda, Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. థామా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల రష్మిక పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం ఆమె విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకుందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.. వీరి రిలేషన్ ను చాలా కాలంగా సీక్రెట్ గా ఉంచారు. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి పై ఓ కన్నేసి ఉంచారు.. ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. కాగా ఈ ఇద్దరూ ఇటీవలే చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరూ ఎక్కడా ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా పంచుకోలేదు విజయ్, రష్మిక. నిశితార్థం తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. కాగా వీరి వివాహం త్వరలోనే జరగనుందని రకరకాల డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇప్పుడు వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తుంది.
వీరి ఎంగేజ్మెంట్ అక్టోబర్ 3న జరిగింది. అలాగే వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో జరగనుందని తెలుస్తుంది. ఉదయపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో జరగనుంది తెలుస్తుంది. ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరగనుందని తెలుస్తుంది. వారి నిశ్చితార్థం మాదిరిగానే, వివాహాన్ని కూడా వీలైనంత సైలెంట్ గా, సీక్రెట్ గా చేసుకోనున్నారని వినిపిస్తుంది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగనుందని అంటున్నారు. దీని పై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక రష్మిక కన్నడ నుంచి తెలుగులోకి అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తుంది. విజయ్, రష్మిక కలిసి గీతగోవిందం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లితో ఒక్కటికాబోతున్నారు. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రష్మిక తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తుండగా.. విజయ్ త్వరలోనే రౌడీ జనార్ధన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




