ప్రతి నెలా కేవలం రూ.15 వేలు.. అతి తక్కువ టైమ్‌లో మీ చేతికి రూ.25 లక్షలు వస్తాయి! పైగా ప్రభుత్వ హామీ ఉంటుంది..
పోస్టాఫీస్ RD పథకంతో ప్రతి నెలా రూ.15,000 పొదుపు చేసి ఆర్థిక భద్రత పొందండి. ఐదేళ్లలో రూ.10 లక్షలు, పదేళ్లకు రూ.25 లక్షలకు పైగా అధిక రాబడితో మీ పెట్టుబడిని పెంచుకోండి. తక్కువ ఆదాయ వర్గాలకు ఇది సురక్షితమైన, లాభదాయకమైన ప్రభుత్వ పెట్టుబడి అవకాశం.

తమ సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ, వారికి ఎక్కద పొదుపు చేయాలో? ఎక్కడ తమ కష్టార్జితాన్ని పొదుపు చేస్తే అధిక రాబడి పొందవచ్చు అనే విషయాలపై పెద్దగా అవగాహన ఉండదు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల కోసం ఎలాంటి పెట్టుబడి, పొదుపు పథకాలు ప్రభుత్వ సంస్థలు అందిస్తున్నాయో వారికి తెలిస్తే ఎగిరి గంత్తేస్తారు. అలాంటి ఓ సూపర్ స్కీమ్ పోస్టాఫీస్‌లో ఉంది. నెలకు కేవలం రూ.15 వేలు పొదుపు చేస్తే అతి తక్కువ టైమ్‌లో మన చేతికి రూ.10 లక్షల పైనే డబ్బు వచ్చే ఓ సూపర్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మీరు ప్రతి నెలా రూ.15 వేల చొప్పున పోస్టాఫీస్ RDలో జమ చేయాలని నిర్ణయించుకుంటే, భవిష్యత్తులో మీరు ఆర్థికంగా భద్రతా పక్కా. ఈ మొత్తం నెలనెలా దాచడం ద్వారా మీరు పెద్ద మొత్తాన్ని పోగుచేయొచ్చు. మీరు నెలకు రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు, అంటే మొత్తం 60 నెలలు జమ చేస్తే, ఐదేళ్ల చివరికి వడ్డీతో కలిపి సుమారు రూ.10,70,492 మీకు లభిస్తాయి. ఇది మీ పొదుపు ప్రయాణంలో తొలి ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు. ఈ దశలోనే చాలామంది డబ్బును విత్‌డ్రా చేసుకుంటారు. కానీ దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే అసలు ప్రయోజనం పొందొచ్చు.
ఐదేళ్లు పూర్తయ్యాక డబ్బును తీసుకోకుండా అదే RDను మరో ఐదు సంవత్సరాలు కొనసాగిస్తే (ఎక్స్‌టెండ్ చేస్తే), మీ పెట్టుబడి మొత్తం పదేళ్లకు చేరుకుంటుంది. ఈ అదనపు కాలంలో మీ డబ్బుపై లభించే వడ్డీ మరింత పెరుగుతుంది. క్రమశిక్షణతో పొదుపు చేస్తే, వడ్డీ వడ్డీపై చేరి మీ సంపద వేగంగా పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం పదేళ్ల పాటు నెలకు రూ.15 వేల చొప్పున RDలో జమ చేస్తే, మీకు కేవలం వడ్డీ రూపంలోనే సుమారు రూ.7,52,000 వరకు లాభం లభిస్తుంది. పదేళ్ల చివరికి మీరు జమ చేసిన మొత్తం, వడ్డీ కలిపి సుమారు రూ.25,62,822 మీ చేతుల్లో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
