AP Degree Online Admissions 2024: విద్యార్ధులకు అలర్ట్.. జూన్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు.. త్వరలో షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్ జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ప్రాథమికంగా నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాల్లో బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి ఉంటేనే కౌన్సెలింగ్‌లో వీటిని పెట్టనున్నట్లు పేర్కొంది. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది...

అమరావతి, మే 31: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్ జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ప్రాథమికంగా నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాల్లో బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి ఉంటేనే కౌన్సెలింగ్‌లో వీటిని పెట్టనున్నట్లు పేర్కొంది. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలు, అనుబంధ గుర్తింపు వంటి తదితర అనుమతులు పొడిగింపు ఫీజును జూన్ 18 లోగా చెల్లించాలని రాష్ట్రంలోని కాలేజీలకు యూనివర్సిటీలు ఆదేశాలు జారీ చేశాయి.
తెలంగాణ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్ 2024 హాల్‌టికెట్లు విడుదల.. జూన్ 3, 8 తేదీల్లో పరీక్షలు
తెలంగాణ లాసెట్ 2024, ఏపీ ఎడ్‌సెట్ 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సంబంధిత సెట్ల అధికారిక వెబ్‌సైట్‌లలో నమోదు చేసి, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ లాసెట్ 2024 పరీక్ష జూన్ 3న నిర్వహించనున్నారు. ఇక ఏపీ ఎడ్‌సెట్ 2024 పరీఓ జూన్ 8న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాసెట్‌లో వచ్చిన ర్యాంకు ద్వారా న్యాయవిద్య చదివేందుకు పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ఎడ్‌సెట్ ద్వారా ఉపాధ్యాయ విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ లాసెట్ 2024 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ఎడ్‌సెట్-2024 హాల్‌టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.